Saturday, April 27, 2024

జోరుమీదున్న కమల్ హాసన్.. క్లాతింగ్ బిజినెస్ లోకి విశ్వనటుడు.. వైరల్ గా ఫొటో షూట్

విక్రమ్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విశ్వ నటుడు కమల్ హాసన్. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు. కాగా కమల్ హాసన్ సొంత బ్యానర్ లో నిర్మించడం వల్ల వచ్చిన లాభాలతో మరుగున పడిన తన సినిమాలను కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఇదేకాకుండా కమల్ హాసన్ మరో బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు. కమల్ హౌజ్ ఆఫ్ ఖద్దర్ అంటూ క్లాతింగ్ బిజినెస్ లోకి వస్తున్నారు.దీని కోసం ఓ సరికొత్త ఫోటో షూట్ చేశారు కమల్ హాసన్. చుట్టూ అప్సరసల్లాంటి అమ్మయిలు మధ్యలో కమల్ హాస్న్ ఈ పోస్టర్స్ చూస్తుంటే అప్సరసల మధ్య మైఖెల్ మదన కామరాజుని చూసినట్టే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ చేసిన ఈ ఫోటో షూట్ విరల్ గా మారింది. కమల్ ఏం చేసినా దానిలో స్పెషాలిటీ ఉండాల్సిందే. అందుకే పడుచు భామలతో కమల్ కత్తిలాంటి స్టిల్స్ ఇచ్చారు. తన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం తానే ఒక మోడల్ గా మారారు కమల్ హాసన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement