Thursday, May 9, 2024

ప్ర‌భాస్ చేతుల మీదుగా.. క‌ళ్యాణం క‌మ‌నీయం వెడ్డింగ్ ఆంథెమ్ రిలీజ్

స్టార్ హీరో ప్ర‌భాస్ క‌ళ్యాణం క‌మ‌నీయం చిత్రం నుండి వెడ్డింగ్‌ ఆంథెమ్‌ సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఇపుడు శర్వానంద్‌కు ఏం చేయాలో తెలుసు.. అంటూ మేకర్స్ లాంఛ్ చేసిన సాంగ్‌ నయా ట్రెండ్‌కు తగ్గట్టుగా సాగుతుంది. పెళ్లి గురించి హీరోలు శర్వానంద్‌, సంతోష్‌ శోభన్‌ డిస్కషన్స్ తర్వాత మొదలైన ఈ పాట కొత్త స్టైల్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను శ్రీచరణ్‌ పాకాల కంపోజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ అయిన ఓ మనసా, హో ఎగిరే సాంగ్స్‌ మ్యూజిక్‌ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్ , ప్రియా భవానీ శంకర్‌ కాంబినేషన్‌ లో వస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం.యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్‌ కుమార్‌ అల్ల డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణం కమనీయం జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement