Sunday, May 5, 2024

ALERT: బీడిఎస్ నోటిఫికేషన్.. రేపటి వరకు వెబ్ ఆప్షన్లు…

రాష్ట్రంలోని దంత వైద్య కళాశాలల్లో బీడిఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వరంగల్ లోని కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం మాప్ ఆఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీడిఎస్ సీట్ల భర్తీకి ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. కన్వీనర్ కోటాలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ ఆఫ్ రౌండ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 5వ తేది మధ్యాహ్నం 3గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. గత విడత కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయిన, చేరి డిస్ కంటిన్యూ చేసిన, అల్ ఇండియా కోటా లో సీటు పొందిన విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులని తెలిపింది. పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement