Friday, May 17, 2024

JNV Admissions – నవోదయ విద్యాలయాల ప్ర‌వేశ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల …

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 649 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి ప్రవేశాల కొరకు ఏప్రిల్‌ 29న పరీక్ష నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల ను బుధవారం నాడు నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది.ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా వారి స్థానిక జిల్లాల్లో ఉన్న నవోదయ పాఠశాలల కు ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉచిత విద్య ను అందిస్తారు.

మరోవైపు రాబోయే 2024-25 విద్యా సంవత్సరం కు సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలకు ఇటీవలే అడ్మిషన్ నోటిఫికేషన్‌ ను కూడా విడుదల చేశారు.ఈ ఏడాది ఆరవ తరగతి లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్ధులు తమ రోల్‌ నంబర్‌ మరియి పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా JNVST 2023 ఫలితాలను చూసుకోవచ్చు. . పరీక్షలకు హాజరైన.విద్యార్ధులు జేఎన్‌వి అడ్మిషన్‌ టెస్ట్ ఫలితాలను navodaya.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement