Thursday, May 2, 2024

JN.1: భారత్‌లో 197కు చేరిన జేఎన్1 కేసులు..

న్యూఢిల్లీ – కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జేఎన్1 వేరియంట్ గా రూపాంతరం చెందిన ఈ వైరస్ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు భారత్ వ్యాప్తంగా 197 జేఎన్1 వేరియంట్ కేసులు నమోదైనట్లు ‘ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది.

మరోవైపు దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 800కు పైగా కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని, తద్వారా క్రియాశీలక కేసుల సంఖ్య 5వేలకు పెరిగినట్లు ‘ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ’ తెలిపింది. ముఖ్యంగా దేశంలో కొవిడ్‌-19 ఉపరకం జేఎన్‌ 1 కేసులు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 197కు చేరింది. ఒక్క కేరళలోనే అత్యధికంగా 83 కేసులు నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. కొత్తగా ఒడిశాలో ఒక ‘జేఎన్‌.1’ పాజిటివ్‌ వెలుగు చూసినట్లు తెలిపింది.

ప్ర‌స్తుతం గోవాలో 51, గుజరాత్ లో 34, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 8, రాజస్థాన్ లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశా, ఢిల్లీలో ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement