Monday, May 20, 2024

YSRTP Merge – ముహూర్తం ఫిక్స్​! ఎల్లుండి కాంగ్రెస్‌లోకి షర్మిల

అమ‌రావ‌తి – వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు కచ్చితమైన సమాచారం అందుతోంది. ఈ నెల 4వ తేదీన వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. అదే రోజు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు టాక్. ఆమెతో పాటు సుమారు మరో 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
తెలంగాణలో ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. మంగళవారం ఉదయం షర్మిల తన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో వైసిపీ విలీనంపై చర్చించారు. విలీనానికి అంద‌రూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో ఆమె రేపు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.. కాంగ్రెస్ పెద్ద‌ల‌ను ఆమె క‌లువ‌నున్నారు.. అక్క‌డే విలీన ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.
అందుకనే ఆయన మళ్లీ అధికారంలోకి రాకూడదని కోరుకున్నట్టు తెలిపారు. తాను పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. కాగా, షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న వార్త ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో హీట్ పెంచింది. కాగా, కాంగ్రెస్ లో ష‌ర్మిల చేరిన వెంట‌నే ఎపి కాంగ్రెస్ పగ్గాలు అధిష్టానం అప్ప‌గించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి..

ఇడుపులపాయకు టూర్​

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కుటుంబ సమేతంగా కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లారు. ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి వైఎస్సార్​ ఘాట్​ను దర్శించుకున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా శుభలేఖలను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రార్థన చేశారు. అదేవిధంగా అట్లూరి ప్రియతో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జరగనుంది. ఈ నెల 18న నిశ్చితార్థ వేడుక ఉంటుందని… ఫిబ్రవరి 17న వివాహ వేడుక జ‌ర‌గ‌నుంది ఈ నేపథ్యంలో కాబోయే వధూవరులు, కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల ఇడుపులపాయకు వెళ్లారు. వివాహ ఆహ్వాన తొలి పత్రికను తన తండ్రి సమాధి వద్ద ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు, అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రాజారెడ్డి, ప్రియ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement