Saturday, May 4, 2024

హైదరాబాద్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా ఉత్పత్తి

సొంత వ్యాక్సిన్‌తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్‌ (జే అండ్ జే)కు చెందిన కరోనా వ్యాక్సిన్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్ ఈ’ తెలిపింది. ఈ రెండు టీకాలకు మౌలిక వసతులు, ప్లాంట్లు పూర్తిగా విడివిడిగానే ఉంటాయని ‘బయోలాజికల్‌ ఈ’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల వెల్లడించారు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రెండింటిని ఉత్పత్తి చేయబోతున్నామని ఆమె తెలిపారు. అయితే జే అండ్ జే టీకాల ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభించే విషయం ఆమె చెప్పలేదు. ఏటా 60 కోట్ల జే అండ్‌ జే టీకా డోసులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తయారు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఫిబ్రవరిలో ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా గత వారం ఈ ఏడాది ఉత్పత్తి అయ్యే టీకాల జాబితాను భారత ప్రభుత్వం విడుదల చేయగా అందులో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా లేకపోవడం గమనార్హం. సొంత టీకా విషయానికొస్తే ఆగస్టు నుంచి 7.5-8 కోట్ల డోసులను తయారు చేయాలని ‘బయోలాజికల్‌ ఈ’ సంస్థ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement