Thursday, April 25, 2024

త్రివిక్రమ్ ఫుల్ ఫోకస్ @మహేష్ బాబు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో త్రివిక్రమ్ కూడా మంచి జోష్ మీద ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ మహేష్ సినిమా విషయంలో స్పీడ్ పెంచారట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయట. మరో వైపు మహేష్ సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మహేష్ త్రివిక్రమ్ సినిమా పట్టలేక్కించనున్నాడట. ఇప్పటికే త్రివిక్రమ్ కూడా తన టీం తో ఈ సినిమాకు సంబంధించి సెట్ ల ఏర్పాటుపై ప్లానింగ్ చేస్తున్నారట. ఓ ప్రత్యేకమైన సెట్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ చేసుకోబోతున్నారని.. ఆ సెట్ లోనే చాలా వరకు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement