Monday, April 29, 2024

సబ్‌స్క్రిప్షన్ మెత‌డ్ ని తీసుకురానున్న జియో సినిమా.. యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేలా కొత్త‌ ప్లాన్స్..

ఈ ఏడాది జ‌రుగుతున్న 16వ‌ ఐపిఎల్ సీజ‌న్ తో మంచి జోష్ మీద ఉంది రిల‌య‌న్స్ జియో సినిమా యాప్‌. ఐపీఎల్ మ్యాచ్ ల‌ను కూడా ఫ్రీగానే స్ట్రీమ్ చేస్తుంది జియో సినిమా. అయితే, ప్ర‌స్తుతం ఈ యాప్ కు ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ లేదు. కేవలం జియోనే కాకుండా ఏ సిమ్ ద్వారా అయినా ఐపీఎల్‌ను అలాగే ఇత‌ర కంటెంట్ ను స్ట్రీమ్ చేయవచ్చు. అయితే ఈ ఫ్రీ స్ట్రీమింగ్ ఎక్కువ కాలం ఉండ‌బోదు. త్వరలో జియో ప్రీమియం ప్లాన్లను తీసుకురానున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ వెబ్‌సైట్ కూడా ఇప్పటికే లైవ్ అయింది.

ప్లాన్ల వివ‌రాలు..

ప్రస్తుతానికి మూడు ప్లాన్లను ఇందులో లిస్ట్ చేశారు..

- Advertisement -
  • డైలీ ప్లాన్. రోజుకు రూ.2 చెల్లించి ఒక్క రోజు వ్యాలిడిటీతో రెండు డివైస్‌ల్లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు.
  • గోల్డ్ ప్లాన్. రూ.99తో మూడు నెలల వ్యాలిడిటీ ఉంటుంది. డైలీ ప్లాన్ తరహాలోనే రెండు డివైస్‌ల్లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసే అవకాశం ఉంది.
  • ప్లాటినం ప్లాన్. రూ.599తో 12 నెలల పాటు దీని వ్యాలిడిటీ ఉండనుంది. ‘యాడ్ ఫ్రీ’ కంటెంట్ తో ఒకేసారి 4డివైస్‌ల్లో స్ట్రీమ్ చేయ‌వ‌చ్చు.

అయితే వీటి అసలు ధరలు వేరే అని, ఇవి ఆఫర్ ధరలు అని జియో అంటుంది. డైలీ ప్లాన్ అసలు ధర రూ.29 కాగా, ఆఫర్ కింద రూ.2కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గోల్డ్ ప్లాన్ అసలు ధర రూ.299 కాగా దీన్ని రూ.99కే అందిస్తున్నారు. ఇక ప్లాటినం ప్లాన్ అసలు ధర రూ.1,199 కాగా దీన్ని రూ.599కే అందిస్తున్నారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద తక్కువ ధరకు అందిస్తున్నారా లేకపోతే ఈ ధరలను చాలా కాలం పాటు కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement