Monday, April 29, 2024

Jharkhand CM: హేమంత్‌ సోరెన్ చుట్టూ ఈడీ…. మ‌రోసారి నోటీసులు

భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ ఇప్పటికే ఏడుసార్లు సమన్లు జారీ చేసింది. కాగా మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ కింద స్టేట్‌మెంట్‌ రికార్డింగ్‌ ఇంకా పూర్తికాలేదని మరోసారి ప్రశ్నించాల్సి ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో జనవరి 27 నుంచి 31లోగా జోనల్‌ ఆఫీస్‌కు రావాలని అందులో పేర్కొంది. గత శనివారం రాచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. సుమారు 7 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. జార్ఖండ్‌లో భూమి యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే భారీ మాఫియాకు సంబంధించిన స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 మందిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. 2011 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన రంజన్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement