Tuesday, April 30, 2024

Ram Mandir: రాంల‌ల్లాకు విరాళంగా ముకుట్… దాని విలువ 11కోట్లు

రాముని దర్శన భాగ్యం కోసం దేశ ప్రజలు ఏంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేడు భక్తులకు రాముని దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రామ మందిరానికి భారీగా విరాళాలు అందుతున్నాయి. రామ భ‌క్తులు త‌మ‌కుతోచిన విధంగా కానుక‌లు స‌మ‌ర్పిస్తున్నారు.

తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో ప్రతిష్టించిన రాంలల్లా విగ్రహానికి ‘ముకుట్’ (కిరీటం) విరాళంగా ఇచ్చారు.గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని ముఖేష్ పటేల్, రాముడికి బంగారం, వజ్రాలు మరియు విలువైన రత్నాలతో అలంకరించబడిన 6 కిలోల బరువున్న కిరీటాన్ని సమర్పించారు. 11 కోట్ల విలువైన కిరీటాన్ని కొత్తగా నిర్మించిన రామమందిరంలో దేవత కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ముకేశ్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగతంగా అయోధ్యను సందర్శించి ఆలయ ట్రస్ట్ అధికారులకు చాలా చక్కగా రూపొందించిన కిరీటాన్ని సమర్పించారు.. రామమందిరం ప్రధాన అర్చకులు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ధర్మకర్తల సమక్షంలో ముఖేష్‌ పటేల్‌ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో కిరీటాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement