Wednesday, May 1, 2024

Editorial: సాకారమైన భవ్యదివ్యధామం!

చరిత్రలో అపురూప, అపూర్వ ఘట్టం సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఆవిష్కార మైంది. యావన్మంది భారతీయులే కాకుండా, దేశ విదేశాల్లోని హిందువులు దీనిని ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ వీక్షించి పులకించిపోయారు. దశాబ్దాల నిరీక్షణ ఫలితంగా అయోధ్యలో భవ్యదివ్య మందిరంలో కొలువుతీరిన బాలరాముని వీక్షించేందుకు రెండు కళ్ళూ చాలలేదు.

ఇది కలా, నిజమా అని చాలామంది సంభ్ర మాశ్చర్యాలకు లోనయ్యారు. మనకు ఎన్నో పుణ్య క్షేత్రా లున్నాయి. వాటిలో ఒకటిగా ఇది జమ కాకుండా, భారత కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేసే రీతిలో దీనిని నిర్మిం చారు. మూడేళ్ళ వ్యవధిలోనే ఈ దివ్యభవ్య మందిరా న్ని నిర్మించిన శిల్పులనూ, మందిర నిర్మాణంలో పాలు పంచుకున్న వారందరినీ ప్రధాని మోడీ స్వయంగా తాను పూలసజ్జ పట్టుకుని, నలుదిక్కులా తిరుగుతూ పూలాభిషేకంతో సత్కరించారు. అయోధ్య రామాల యంకోసం భారతీయులు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూ స్తున్నారు. దేశమంతటా రామాలయాలు ఉన్నాయి. అన్నింటికి మించి అయోధ్యలోని రామాలయానికి ఎందుకంత ప్రత్యేకత అంటే, సరయూ నదీ తీరాన రాముడు పుట్టిన ప్రదేశంలో ఆలయ నిర్మాణాన్ని తలపెట్టడం వల్ల ఇంత జాప్యం జరిగింది. శ్రీరామనవమి సంద ర్భంగా వాడవాడలా, వీధివీధినా సీతారామ కల్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.

ముఖ్యంగా తెలుగునాట సీతారామ కల్యాణమహోత్సవాలు జరగని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. దశావతారాల్లో శ్రీరాముని అవతారం మనకు బాగా దగ్గరదని పౌరాణికు లు తరచూప్రబోధిస్తూ ఉంటారు. రాముడు ఆదర్శ మానవుడు, మర్యాద పురుషోత్తముడు. రాముణ్ణి ఎన్ని పేర్లతో, ఎన్ని విశేషణాలతోపిలిచినా తక్కువే. మన దేశం లో రాముణ్ణి ఆరాధించేవారు అసంఖ్యాకంగా ఉన్నప్పటి కీ, రామాలయాన్ని నిర్మించుకోవడానికి ఇంతకాలం ఎందుకు పట్టిందంటే, ఇందుకు అనేక కారణాలున్నాయి. రామజన్మ భూమిలో బాబ్రీ మసీదు నిర్మాణం కావడం చారిత్రక కారణం కాగా, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లౌకిక వ్యవస్థకు కట్టుబడిన మన దేశంలో రామాలయం నిర్మాణానికి మతపరమైన అభ్యంతరాలే కాక, మన రాజకీయ వ్యవస్థలో లౌకిక వాదుల నుంచి వచ్చిన అడ్డంకులు కూడా కారణమే. బాబ్రి మసీదు స్థలంలో రామాలయం గతంలో నిర్మించబడి ఉందా అన్న దానిపై చాలా కాలం శషబిషలు, సందేహాలు కొనసాగాయి. చారిత్రకాంశాల పరిశీలన తర్వాత కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరికి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తుది తీర్పుతోఅవన్నీ తొలగిపోయాయి. ఇందు కోసం గతంలో పాలకులు ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ, సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో ఈ విషయమై ముందడుగు వేయడానికి ఏ ప్రభుత్వమూ సాహసించ లేదు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పూర్తి మెజా రిటీ, రాజకీయ సంకల్పం,ప్రజాభీష్టంతో ముందడుగు వేయగలిగింది.ప్రధాని నరేంద్రమోడీ తమ పార్టీ అజెం డాకు మతపరమైన రంగు కలగకుండా సామాజిక న్యా యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారాలను కను గొంటున్నారు.ముస్లిం సమాజంలో ఎంతోకాలంగా కొనసాగుతున్న త్రిపుల్‌తలాఖ్‌ని రద్దు చేయడానికి సామాజిక న్యాయాన్ని ఆధారంగా తీసుకున్నారు. స్త్రీపు రుషుల మధ్య సమానత్వాన్ని ఆధారం చేసుకుని సర్వో న్నత న్యాయస్థానం ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చేట్టు చేయగలిగారు. అలాగే, ఇప్పుడు రామాలయ నిర్మాణ వివాదాన్ని స్థలంకోసం ఇరువర్గాల మధ్య సాగుతున్న పేచీగా పరిగణించి దీనిపై సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక ఆధారాలననుసరించి ఈ వివాదాన్ని పరిష్క రించింది. ఇంతకాలం దీనిని మతపరంగా చూడటం వల్లనే ఇది పరిష్కారం కాలేదు. రామాయణ కాలం నాటి పౌరాణిక, చారిత్రక అంశాలను ఆధారం చేసుకుని స్థల వివాదాన్ని కోర్టు పరిష్కరించింది. మందిరమా? మసీదా? అనే వివాదంతో దీనిని ముడిపెట్టడం వల్లనే ఇది మత పరమైన వివాదంగా ఏళ్ళ తరబడి పరిష్కారం కాలేదు.

- Advertisement -

అంతేకాక, మసీదుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం కూడా ఆవలి వర్గాన్ని సంతృప్తి పర్చింది. దీంతో మందిర నిర్మా ణానికి అడ్డంకులన్నీ తొలగిపోయి, చక చకా నిర్మాణం సాగిపోయేందుకు వీలు కలిగింది.అయోధ్యలో రామా లయ నిర్మాణం కల కాదు, వాస్తవమేనని రుజువు చేయ డంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రదర్శించిన యుక్తి, ధీశక్తి ప్రశంసనీయం. ఆయన పాలన అంతా ఒక ఎత్తు. రామాలయం నిర్మాణం మరో ఎత్తు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ప్రక్రియలో ప్రధాని మోడీ ఆదినుంచి చూపి న భక్తిశ్రద్ధలు, చిత్తశుద్ధి ఇంకోఎత్తు. ఆలయ నిర్మాణంలో జాప్యానికి ఆయన రాముడికి క్షమాపణలు చెప్పి యావ త్‌ దేశప్రజల మనసు దోచుకున్నారు. ప్రధాని మోడీని కారణజన్ముడు అని కీర్తిస్తున్నారు. ఆ భుజకీర్తులకు తాను అర్హుడినని ఆయనే నిరూపించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement