Monday, April 29, 2024

అల్లుడు వారసుడు కాదుగా..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజకీయవారసుడి అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేసీఆర్‌ వారసుడి ఇష్యూను తెరపైకి తెచ్చారు. కేసీఆర్‌కి రాజకీయ వారసుడు కేటీఆరే అవుతాడన్న ఆయన.. అల్లుడు కాడు కదా వారసుడు.. అని అన్నారు జగ్గారెడ్డి. ఏ ఎన్నికలు వచ్చినా.. ఇదిగో ఈ ఎన్నికల తర్వాత కాబోయే సీఎం కేటీఆరే నంటూ విమర్శలు వచ్చిన సందర్భాలు ఎన్నో.. ఇక, అంతా అయిపోయేది.. కేటీఆర్‌ సీఎం అవుతున్నారంటూ ప్రచారం సాగిన సందర్భాలు అనేకం.. మరికొందరు కేసీఆర్‌ రాజకీయ వారసుడు ఆయన మేనల్లుడు హరీష్‌రావు అనేవారు లేకపోలేదు.. కేటీఆర్‌ కంటే హరీష్‌రావు సీనియర్‌ అని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్య ఈటల రాజేంధర్ మంత్రి హరీష్ రావుపై పలు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకి సీఎం కుర్చిపై కన్ను పడిందని సంచలన కామెంట్ చేశారు. దీంతో హరీష్ రావుని కూడా పార్టీ నుంచి తొలగిస్తారని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి.

మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో రూ.10 వేలు ఇచ్చినట్టు… రాష్ట్రమంతా వర్షాలు వస్తున్నాయి కాబట్టి.. రాష్ట్ర వ్యాప్తంగా వర్షంతో నష్టపోయినవారికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు జగ్గారెడ్డి.. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని కోరిన ఆయన.. వర్షంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. సీఎం ఢిల్లీలో ఉన్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో కలెక్టర్లు ఉన్నారా..? అని ప్రశ్నించిన జగ్గారెడ్డి.. కలెక్టర్లు ఎమ్మెల్యేలకే దొరకడం లేదు అని విమర్శించారు. కలెక్టర్ కార్యాలయాలు భూతు బంగళాల అయ్యాయంటూ మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: క‌రీంన‌గ‌ర్‌ వ‌ర‌ద‌ల‌కు కార‌ణం ఏమిటో?

Advertisement

తాజా వార్తలు

Advertisement