Monday, April 29, 2024

పవన్‌ కళ్యాణ్‌ను సోము వీర్రాజు హీరోగా చూడటం లేదా?

ఏపీలో వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై ప్రతిపక్షంలోని బీజేపీ మండిపడుతోంది. దీంతో వినాయక చవితి వేడుకలపై సినిమా ప్రముఖులు స్పందించాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రతి సినిమా ప్రారంభానికి వినాయకుడికి కొబ్బరికాయ కొడతారని.. అలాంటి సినీ ప్రముఖులు ఏపీలో వినాయకచవితి పండగపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

అయితే ఏపీలో బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ముందుగా ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సోము వీర్రాజుకు పవన్ కళ్యాణ్ హీరోగా కనిపించడం లేదా అంటూ సోషల్ మీడియలో ప్రశ్నిస్తున్నారు. మెగా కుటుంబంలో క్రికెట్ టీమ్ లాగా 11 మంది హీరోలు ఉన్నారని.. ముందుగా వాళ్లు స్పందిస్తే ఏపీ సర్కారులో కదలిక వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement