Friday, March 29, 2024

జైలులో సీఎం తండ్రి.. చేసిన నేరం ఏంటి?

ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ అరెస్టయ్యారు. బ్రాహ్మణుల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఇటీవల ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు.రాయ్​పుర్​లోని న్యాయస్థానంలో నందకుమార్​ను హాజరుపర్చగా… ఆయనకు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

మరోవైపు దీనిపై స్పందించిన సీఎం భూపేష్ బాగల్.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. 86 సంవత్సరాల వయసున్న తన తండ్రి అయినా కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే కుదరదని సీఎం వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: క‌రీంన‌గ‌ర్‌ వ‌ర‌ద‌ల‌కు కార‌ణం ఏమిటో?

Advertisement

తాజా వార్తలు

Advertisement