Thursday, May 2, 2024

మీకు తెలుసా… జగన్ ఫిజియోథెరపిస్టే తిరుపతి అభ్యర్థి

‌తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. దీంతో ప్రధాన పార్టీలు అన్ని కూడా సిద్ధం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జోష్ లో వైసీపీ పార్టీ అప్పుడే అభ్యర్థిని కూడా ప్రకటించింది. తమ అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించింది. మరోవైపు తెదేపా పార్టీ నుంచి పనబాక లక్ష్మి పేరు ఇదివరకే ప్రకటించారు. ఇక మిగిలిన బీజేపీ, కాంగ్రెస్‌ల పార్టీ లు పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు. కాగా తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో చ‌నిపోవ‌డంతో.. ఉప ఎన్నిక అనివార్య‌మైంది. తొలుత ఆయ‌న కుమారుడు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తికి టికెట్ ఇవ్వాల‌ని వైసీపీ భావించింది. అయితే రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన‌కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది. దీంతో డాక్టర్‌ గురుమూర్తిని లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది.

ఇంతకీ ఈ గురు మూర్తి ఎవరో తెలుసా??

ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ నుంచి ఏపీలోని 13 జిల్లాల మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 341 రోజులు 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాలు… 2,516 గ్రామాలు.. 124 బహిరంగ సభలతో.. 55 ఆత్మీయ సమ్మేళనాలతో ముగిసింది. అయితే ఉదయం ప్రారంభం అయ్యి సాయంత్రం ముగిసేది. కాగా మొత్తం పాదయాత్రలో జగన్ ఫీజియోథెరపిస్ట్ గా పని చేసిన వ్యక్తే ఈ డాక్టర్ గురుమూర్తి. ఎటువంటి లాభాన్ని కూడా ఆశించకుండా జగన్ తో పాటు పాదయాత్రలో మొత్తం తోడుగా ఉన్న గురుమూర్తికే జగన్ సీట్ ఇచ్చారు. దానికి కారణం కూడా లేకలేదు. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలు. ఆర్థిక, అంగబలాలకు లోటు లేదు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారు. వ్యక్తిగత ప్రాచుర్యం కంటే.. ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీకి ఉండే సహజమైన అనుకూలతలతో ఆయన విజయం ఖాయమన్న ధీమాలో పార్టీ శ్రేణులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement