Saturday, May 18, 2024

గిన్నిస్ బుక్ లోకి ఎక్క‌నున్న మేక‌పిల్ల‌-పొడ‌వైన చెవులే దీని స్పెషాలిటీ

గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్క‌నుంది ఓ మేక‌పిల్ల‌. దీని స్పెష‌ల్ ఏంటీ అనుకుంటున్నారా..దీని చెవులు. పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించింది. ఈ మేక పిల్లకు 19 ఇంచులు (46 సెంటీమీటర్లు) పొడవైన చెవులు ఉన్నాయి. జూన్ 5న ఈ మేక పిల్ల జన్మించింది. మేక పిల్ల యజమాని ముహమ్మద్ హాసన్ దీనికి సింబా అనే పేరు పెట్టాడు. ఈ మేక పిల్ల పుట్టిన తర్వాత దీన్ని చూసిన వారందరూ నోరెళ్లబెట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో దీని చెవులు ఉన్నాయి. అది నడుస్తుంటే దాని చెవులు నేలను తాకుతున్నాయి. దీంతో దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. రాత్రికి రాత్రే ఇది పాకిస్థాన్ లో ఒక సెలబ్రిటీ అయిపోయింది. జన్యుపరమైన తేడాల వల్లే మేక పిల్ల చెవులు అంత పొడవుగా ఉండొచ్చని నిపుణులు చెపుతున్నారు. ఏదేమైనప్పటికీ పొడవైన చెవులతో ఈ మేక పిల్ల ఎంతో అందంగా, ప్రత్యేకమైన ఆకర్షణతో కనపడుతోంది. ఇప్పుడు గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement