Friday, April 26, 2024

సంతోషంతో గాల్లో తేలుతున్నట్లు ఉంది.. ప్రేక్షకులకు లెటర్ రాసిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం యశోద. ఈ చిత్రం విజయవంతంగా నడుస్తుండటంతో సమంత ఓ లేఖ రాసింది.ప్రియమైన సినీ ప్రేక్షకులకు.. యశోద సినిమాపై మీరు చూస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీరు ఇస్తున్న మద్దతు.. మీ ప్రశంసలు చూస్తున్నాను.. ఇది నాకు లభించిన గొప్ప బహుమతి .. సినిమాకు వస్తున్న స్పందన నాకు ఎంతో సంతోషాన్ని అందిస్తోంది. యశోద సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో మీ ఈలలు.. మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను.

దీని వెనక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా కష్టపడ్డారు..ఇప్పుడు సంతోషంతో గాల్లో తేలిపోతున్నట్టు ఉంది.యశోద మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్లకు ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన వాళ్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపైన ఈ కథ పైన నమ్మకం ఉంచిన నిర్మాత శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి, దర్శకుడు హరి హరీష్ కి ప్రత్యేక ధన్యవాదాలు.. నా ప్రియమైన సహనటులు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ గారికి మిగతా అద్భుతమైన నటీనటులు అందరితో కలిసి పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. మీకెప్పటికీ ఈ జీవితాంతం రుణపడి ఉంటాను.. మీ సమంత అని ప్రేక్షకులకు రాసిన ఒక లేఖలో సమంత ఈ విధంగా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement