Sunday, December 10, 2023

ప్రియురాలి కోసం రూ. 100కోట్ల‌తో.. ల‌గ్జ‌రీ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసిన హృతిక్ రోషన్

ఏడాది కాలంగా డేటింగ్ లో ఉన్నారు 48 ఏళ్ల హృతిక్ రోషన్ – 37 వయసు సబా ఆజాద్ . ఈ జంట ఇప్పటికే తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఇద్దరూ కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలో మొదటిసారి అధికారికంగా క‌నిపించారు. అప్పటి నుండి మీడియా కథనాలు వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు వీరిపై విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. సబా -హృతిక్ తరచుగా ముంబైలో కనిపిస్తారు. కలిసి ఈవెంట్లకు హాజరవుతారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళుతున్నారు.

- Advertisement -
   

హృతిక్ రోషన్ ..సబా ఆజాద్ కలిసి మన్నత్ అనే భవంలో మూడు అంతస్తులలో విస్తరించి ఉన్న అపార్ట్ మెంట్ ను పునరుద్ధరించడానికి దాదాపు 100 కోట్ల రూపాయలను వెచ్చించారు.ఈ జంట అతి త్వరలో అక్కడికి మారతారు. అత్యంత విలాసవంతమైన ముంబై సీ-వ్యూ అపార్ట్ మెంట్ లో సబా ఆజాద్ తో కలిసి జీవించడానికి హృతిక్ రోషన్ చాలా ఉత్సాహంగా ప్రతిదీ సిద్ధం చేస్తున్నారట‌. హృతిక్ రోషన్ రెండు అపార్ట్ మెంట్ లను రూ.97.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఈ జంట కొత్త నివాసం జుహు-వెర్సోవా లింక్ రోడ్డుకు సమీపంలో ఉంది. దాదాపు 38000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ డ్యూప్లెక్స్ 15 -16వ అంతస్తులలో ఉంది. దీని కోసం హృతిక్ రూ. 67.50 కోట్లు చెల్లించాడు. ఇతర అపార్ట్ మెంట్ కోసం దాదాపు రూ. 30 వెచ్చించాడు.హృతిక్ ఇంతకుముందు ఇంటీరియర్ డిజైనర్ సుసానే ఖాన్ ను వివాహం చేసుకున్నాడు. వారు 2014లో విడిపోయారు. ఈ జంట కుమారులు హ్రేహాన్ రోషన్ – హృదయ్ రోషన్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement