Friday, May 3, 2024

ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ఐటీఎఫ్‌ క్వాలిఫైయింగ్‌ రౌండ్లు.. మెయిన్‌ డ్రా ఫిబ్రవరి 28

పదుకొణ- ద్రావిడ్‌ సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌లో ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమైన ఐటీఎఫ్‌ మహిళల 25కె టోర్నమెంట్‌లో ప్రపంచ వ్యాప్తంగా అగ్రశ్రేణి మహిళా టెన్నిస్‌ క్రీడాకారులు సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో కిరీటం కోసం పోరాడుతున్నారు
ఈ టోర్నమెంట్‌ ఇంటర్‌నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ (ఐటీఎఫ్‌) మంజూరుచేసిన ప్రీమియర్‌ ఈవెంట్‌, ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌, కర్నాటక స్టేట్‌ లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.

ఫిబ్రవరి 26-27 తేదీల్లో క్వాలి ఫైయింగ్‌ రౌండ్లు జరుగుతాయి. మెయిన్‌ డ్రా ఫిబ్రవరి 28న ప్రారంభమవుతుంది. ” ఈ క్యాలిబర్‌ టోర్నమెంట్‌ మనదేశంలోని మహిళా టెన్నిస్‌ క్రీడాకారులు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎదగడానికి అవసరమైన ఐటీఎఫ్‌ పాయింట్లను పొందడంలో సహాయపడుతుంది.” అని పదుకొణ – ద్రవిడ్‌ సెంటర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌ వ్యవస్థాపకుడు వివేక్‌ కుమార్‌ అన్నారు.

సానియా రిటైర్‌మెంట్‌ నేపథ్యంలో మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణి సంబంధించిన అధ్యాయానికి తెరపడింది.కొత్త తరం మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణులను ప్రపంచ వేదికపై విజయం సాధించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ నెంబర్‌ 245, ప్రపంచ నెంబర్‌ 265 కర్మన్‌ కౌర్‌ థాండీ టోర్నమెంట్‌లో పాల్గొనే అగ్ర శ్రేణి భారతీయ టెన్నిస్‌ క్రీడాకారిణులు ఈ టోర్నీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement