Thursday, April 25, 2024

డోలో-650 తయారీదారుపై ఐటి రైడ్స్‌.. కీలక పత్రాల పరిశీలన

బెంగుళూరు: డోలో-650 తయారీ దారులైన బెంగుళూరుకు చెందిన ఫార్మా స్యూటికల్‌ కంపెనీ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ప్రాంగణంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. కంపెనీ 2020లో కోవిడ్‌ వ్యాప్తి చెందినప్పటి నుంచి 350 కోట్ల డోలో 650 టాబ్లెట్లను విక్రయించడం ద్వారా రూ. 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు కంపెనీ సీఎండి దిలీప్‌ సురానా కంపెనీ వెబ్‌సైట్‌లోని ఓ కథనంలో తెలిపారు.

ఐటిదాడులు..

ప్రస్తుతం డోలో మాత్రలు తెలియని వారు ఉండరనడం అతి శయోక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. గత రెండేళ్లలో కోవిడ్‌ -19 రోగులు ఈ టాబ్లెట్లను చాలా విరివిగా వినియోగించారు. అయితే డోలో -650 ట్యాబ్లెట్‌ తయారీ దారులు పన్ను ఎగవేత ఆరోపణలపై బెంగుళూరుకు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఆవరణలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. సోదాల్లో భాగంగా కంపెనీ ఆర్థిక లావాదేవీలకు చెందిన కీలక పత్రాలు, బ్యాలెన్స్‌ షీట్లు, బిజినెస్‌ డిస్ట్రిబ్యూటర్‌ నెట్‌ వర్క్‌లను విభాగం పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు. ఏక కాలంలో కంపెనీకి చెందిన అనేక ప్రదేశాల్లో దాదాపు 200 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లిd, సిక్కిం, పంజాబ్‌, తమిళనాడు, గోవా వంటి 40కి పైగా ప్రదేశాల్లో రైడ్స్‌ నిర్వహించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.

కంపెనీ వ్యాపార నిర్వహణ..

ఇతర నగరాల్లోని కంపెనీకి సంబంధించిన మరికొన్ని లింక్డ్‌ లొకేషన్‌లతో పాటు కంపెనీ ప్రమోటర్లు, డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆదాయపన్ను అధికారులు కవర్‌ చేస్తున్నారు. కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం .. ఔషధ ఉత్తత్తులు, యాక్టివ్‌ ఫార్మా స్యూటికల్‌ ఇంగ్రెడియంట్స్‌) తయారీ, మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కంపెనీకి దేశ వ్యాప్తంగా 17 తయారీ యూనిట్లు ఉన్నాయని, ఇతర దేశాల్లోనూ ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోందని పేర్కొంది.

- Advertisement -

డోలో ప్రాముఖ్యత..

కంపెనీ తయారు చేస్తున్న ప్రధాన ఫార్మా ఉత్పత్తుల్లో .. డోలో -650, అనాల్జేసిక్‌, యాంటీ పైరైటిక్‌ని వైద్యులు , మెడికల్‌ షాపు యజమానులు కరోనా వైరస్‌ రోగులకు నొప్పి, జ్వరం, కొవిడ్‌ వల్ల కలిగే సాధారణ లక్షణాలను తగ్గించడానికి ప్రిస్కైబ్‌ చేసేవారు.
కంపెనీ వెబ్‌సైట్‌ ఫిబ్రవరిలో ప్రచురించిన ఒక వార్తా కథనాన్ని తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించింది. ”కంపెనీ 2020లో కోవిడ్‌ -19 వ్యాప్తి చెందినప్పటి నుండి 350 కోట్ల టాబ్లెట్‌లను విక్రయించింది. రూ. 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement