Friday, April 26, 2024

మలేసియా మాస్టర్స్ లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు సింధు, ప్రణయ్‌… వెనుదిరిగిన కశ్యప్‌, సాయిప్రణీత్‌

మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత దిగ్గజ షట్టర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరగా, ప్రిక్వార్టర్‌లోనే పారుపల్లి కశ్యప్‌, సాయి ప్రణీత్‌ పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. అయితే భారత దిగ్గజ షట్లర్‌ పీవీ సింధు మలేసియా మాస్టర్స్‌లో మరోసారి సత్తా చాటింది. గురువారంనాడిక్కడ అక్సిట అరెనా వేదికగా జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో చైనా క్రీడాకారిణి జాంగ్‌ యీపై 21-12, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. 26 నిముషాల్లోనే మ్యాచ్‌ ముగిసింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ తన ప్రత్యర్థి వాంగ్‌ జు వీఐ (చైనీస్‌ తైపీ)పై 21-19, 21-16తేడాతో విజయం సాధించాడు. 44నిముషాలపాటు సాగిన పోరులో తొలి నుంచి హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ గెలుపునందుకున్నాడు.

మరో భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. చైనాకు చెందిన లీ షి ఫెంగ్‌ చేతిలో 14-21, 17-21 తేడాతో సాయిప్రణీత్‌ ఓటమి పాలయ్యాడు. స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ ప్రిక్వార్టర్స్‌లో ఇండోనేసియాకు చెందిన ఆంథోని సినిసుకా గింటింగ్‌ చేతిలో 10-21, 15-21 తేడాతో ఓడిపోయాడు. దాదాపు 34 నిముషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో వరుసగా రెండో రౌండ్లలో సినిసుకా పూర్తి ఆధిపత్యం కనబర్చారు. దీంతో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement