Monday, May 6, 2024

కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడంపై అలజడలు సృష్టించడం స‌రికాదు : ముద్రగడ

కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌పేరు పెట్టడం గర్వంగా భావించాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు ఇవాళ కోనసీమ జిల్లా పెద్దలకు విన్నపం అంటూ ఓ లేఖను విడుదల చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరును పెట్టడంపై కొంతమంది అలజడలు సృష్టించడం అన్యాయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌ను యావత్తు ప్రపంచమే ప్రశంసిస్తుంటే జిల్లాకు అంబేద్కర్‌ పేరుపై అభ్యంతరం పెట్టడం న్యాయమా అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement