Friday, May 3, 2024

ఐటీ దిగ్గజం విప్రో సీఈవోగా అనిస్‌ నియామకం..

ఐటీ దిగ్గజం విప్రో.. ఆసియా పసిఫిక్‌, భారత్‌, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతాల విభాగం (ఏపీఎంఈఏ) సీఈవోగా అనిస్‌ చెన్చా నియమితులయ్యారు. కన్సల్టింగ్‌, ఐటీ, బిజినెస్‌ ప్రాసెస్‌ సర్వీసుల్లో ఆయనకు రెండు దశాబ్దాలపైగా అనుభవం ఉందని సంస్థ వెల్లడించింది. అనిస్‌ ఇప్పటివరకూ క్యాప్‌జెమినిలో గ్లోబల్‌ సీఈవోగా (బిజినెస్‌ సర్వీసెస్‌ విభాగం), గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యునిగా వ్యవహరించారు. అత్యంత సమర్ధమంతులైనవారితో టీమ్‌లను తీర్చిదిద్దడం, సంక్లిష్టమైన మార్పులను సమర్ధంగా అమలు చేయగలగడం వంటి సామర్థ్యాలు అనిస్‌కు ఉన్నాయని ఈ సందర్భంగా విప్రో సీఈవో, ఎండీ థియెరీ డెలాపోర్ట్‌ తెలిపారు. కాగా ఇప్పటివరకూ ఏపీఎంఈఏ స్ట్రాటజిక్‌ మార్కెట్‌ యూనిట్‌ సీఈవోగా వ్యవహరించిన ఎన్‌ఎస్‌ బాలా వ్యక్తిగత కారణాలతో తిరిగి అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో ఆ స్థానంలో అనిస్‌ నియమితులయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement