Sunday, April 28, 2024

ఐటితో క‌ళ‌క‌ళ …. విశాఖ మిల‌మిల‌…

విశాఖపట్నం, ప్రభన్యూస్‌:అంతర్జాతీయ ప్రమాణాలతో అభి వృద్ధి చెందుతున్న విశాఖ తూర్పు సాగరతీరం సరికొత్త ఐటీ-హబ్గా అవతరించబోతున్నది. జాతీయ,అంతర్జాతీయ ఐటీ- కంపెనీ దిగ్గజా లు వైజాగ్‌ ఈస్ట్‌ వైపు తమ కార్యకలాపాలు సాగించడానికి,పెట్టు-బడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. త్వరలో ఇన్ఫోసిస్‌,మరో 60సంస్థలు పెట్టు-బడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో విశాఖ తూర్పు తీరం భారత దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మి దవ స్థానంలో నిలవనుంది. ఇప్పటికేఐబీఎం,కండా యింట్‌,మిరక ల్‌, ఫిన్టెక్‌ టవర్‌, సిబాయిసీస్‌,సీయింట్‌,మౌరి -టె-క్‌,మరికొన్ని ఇతర కంపెనీలతో సహా 18 వరకు పెద్ద పలు ఐటీ- కంపెనీలు విశాఖ తూర్పు తీరాన్ని ఆనుకొని ఉన్న రుషికొండ కొండల పరీవాహక ప్రాంతంలో తమ వ్యాపారాన్ని విస్తరి స్తూ విజ య వంతంగా నడి పిస్తున్నా యి. విశాఖపట్నం జాతీయ రహదారిని అనుసంధా నం చేస్తూ ఇటు- రుషి కొండ, అటు- మధురవాడ కొండల్లో అంతర్జాతీయ ప్రసిద్ద ఐటీ-కంపెనీలు తమ యూనిట్లను స్థాపించి విజయ వంతంగా సాగుతున్నాయి. వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత విశాఖ విషయంలో ఐటీ- కంపెనీలకు నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సంస్థ ఏర్పాటు-కు ప్రముఖ ఐటీ- సంస్థ అమెజాన్‌ సిస్టమ్‌ సాప్ట్వేర్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌, ఐటీ- ఆధారిత సేవల కేంద్రాన్ని ఏర్పాటు- చేస్తామని ముందుకొచ్చింది. ఇందు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు- సాప్ట్వేర్‌ -టె-క్నాలజీ ఫార్మ్స్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్టీపీఐ) ప్రకటించింది.

తూర్పు తీరంలో ఎన్నో ఐటీ- పరిశ్రమల
భోగాపురం గ్రీన్ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్నికలిపే ఆరు లేన్ల బీచ్‌ ఫ్రంట్‌ ఎక్సెస్ర్‌ హైవేతో, రియల్టర్లు, బిల్డర్లు, వ్యక్తులు వాణిజ్య అవస రాల కోసం ఈ ప్రాంతాలలో పెట్టు-బడులుపెట్టడానికి పరుగెత్తుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఐటీ-సెజ్‌ రుషి కొండ, మధుర వాడను ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి కార్యకలాపాలు విజయ వంతంగా సాగుతు న్నాయి. ఇప్పటికే భోగాపురం గ్రీన్ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానా శ్రయం,ఎక్సెస్ర్‌ హైవేతో పాటు-, దేశంలోనే మొట్టమొదటిసారిగా యునెస్కో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ స్టసనబుల్‌ డెవలప్మెంట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదే ప్రాంతంలో ఐ-హబ్ను అభివృద్ధి చేస్తున్నా యి.ఇప్పటికేనాస్కామ్‌,గోవిన్‌క్యాపిటల్‌,ఎన్‌ఆర్డీసీ, ఆంధ్రప్రదేశ్‌ఇన్నోవేషన్వ్యాలీ, సన్రైజ్ట వర్స్‌-ఇం క్యుబేషన్‌ హబ్లు సాంకేతిక రంగంలో తన సత్తాచాటు-కుంటు-న్నాయి. అంతేకాదు అనేక మంది స్థానిక యువతీ, యువకులకు ఉపాధి అవకా శాలు కల్పించాయి. దీంతోపాటు- ఐటీ- రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి ని గడిరచిన అదానీ డేటా సెంట ర్‌, -టె-క్నాలజీ పార్క్‌ రాబో తుండ టంతో ఈ ప్రాంతానికి మరింత ప్రాము ఖ్య త సంతరించికుంది. అంతేకా కుండా, విప్రో, కాన్సెం ట్రిక్స్‌,-టె-క్‌మహీంద్రా, డబ్ల్యూఏస్‌, హెచ్‌ఎస్బీసీ,పాత్ర ఇండియా, ప్లnూయం ట్గ్రిడ్ల్రతో సహా మరిన్నో ఐటీ- దిగ్గజాలు నగరంలో తమ యూనిట్లను స్థాపించాయి.

విశాలమైన రహదారుల అనుసంధానం
వాస్తవానికి బీచ్‌ ఫ్రంట్లో నాలుగు లేన్ల విశాఖ -భీమిలి రహదా రిని అభివృద్ధి చేసిన తర్వాత మధురవాడ- ఆనందపురం- భీమిలి మధ్య ప్రాంతానికి పెద్ద క్రేజ్‌ లభించింది. ఇప్పుడు ఇదే రహదా రిని ఆరులైన్ల రహదారిని విస్తరించి భోగాపురం అంతర్జాతీయ విమనాశ్ర యానికి అనుసంధానం చేసే ప్రతిపాదనలు చేయడంతో విశాఖ తూ ర్పు తీరానికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement