Monday, April 29, 2024

Iraq – యూనివర్సిటీలో ఘోర అగ్నిప్రమాదం – 14 మంది దుర్మరణం

ఇరాక్ లోని సోరన్ యూనివర్సిటీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోరన్ యూనివర్సిటీ హాస్టల్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.

మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరాక్‌లోని ఉత్తర కుర్దిస్థాన్ ప్రాంతంలోని యూనివర్సిటీ హాస్టల్ లో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 14 మంది మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానిక కుర్దిష్ టెలివిజన్ ఛానల్ రుడావ్ భవనం ముందు పని చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఫుటేజీని ప్రసారం చేసింది. ఇందులో అకడమిక్ సిబ్బంది, సోరన్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement