Thursday, May 9, 2024

IR Raids – తెలంగాణకు తరలించేందుకు సిద్దంగా ఉన్న రూ. 42 కోట్ల న‌గ‌దు స్వాధీనం…

బెంగళూరు సుల్తాన్‌పాళ్యం ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేసిన సోదాల్లో 42 కోట్లకు పైగా నగదును గుర్తించారు. ఈ నగదును తెలంగాణకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఐటి రైడ్ జరిగింది.. మొత్తం 42 కోట్ల క్యాష్ ను ఇక ప్లాట్ లోని సోఫాలో గుర్తించారు.. ఈ క్యాష్ ను తెలంగాణ ఎన్నికలలో ఒక పార్టీ కోసం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంచారని ఐటి అధికారులు భావిస్తున్నారు.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

వివరాలలోకి వెళితే . బెంగుళూరు లో కాంట్రాక్టర్ అంబికాపతి, ఆయన భార్య-మాజీ కార్పొరేటర్ అశ్వతమ్మలు అయిదు రాష్ట్రాలలో ఎన్నికలకు నిధులు మంజూరు చేస్తున్నారనే అనుమానంతో ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో మాజీ కార్పొరేటర్ బంధువు ఫ్లాట్‌లో రూ.42 కోట్ల నగదు దొరికినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఆర్టీనగర్‌లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్‌లో సోఫా కింద నగదు లభ్యమైనట్లు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.

మాజీ కార్పొరేటర్ బంధువు, మాజీ మహిళా కార్పొరేటర్ బంధువు ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాజీ మహిళా కార్పొరేటర్ భర్త కూడా కాంట్రాక్టర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ కాగా, ఆమె సోదరుడికి చెందిన ఫ్లాట్ కు ప్రస్తుతం ఆర్థికసాయం చేస్తున్నారు. ఐదు రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్ర ఎన్నికలకు ఖర్చు చేసేందుకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం అందగా.. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలీసు సిబ్బంది భద్రతతో వచ్చిన ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ముమ్మరం చేసిన విచారణ
ఫ్లాట్‌లో దొరికిన రూ.42 కోట్లకు సంబంధించి మాజీ కార్పొరేటర్ సోదరుడిని ఆదాయపన్ను శాఖ అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. మరోవైపు మాజీ కార్పొరేటర్‌కు సంబంధించిన వ్యాపార, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అతను కాంట్రాక్టర్, అతని కార్యాలయంతో పాటు మ‌రో ఐదుకు పైగా చోట్ల సోదాలు నేడు కూడా కొన‌సాగిస్తున్నారు. ఐటీ అధికారుల బృందం మొత్తం రూ.42 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకుంది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement