Thursday, May 2, 2024

ఐపోన్ 15 లాంచ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన కంపెనీ

యాపిల్ ఐఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల్ లాంఛ్ డేట్ ఫిక్స అయింది. వచ్చే నెల (సెప్టెంబర్) 12న ఆపిల్ వండర్ లస్ట్ పేరుతో జరిగే ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ ని లాంచ్ చేయనున్నారు. ఈమేరకు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని ఆపిల్ వైబ్ సైట్, సోషల్ మీడియా ఖాతాల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు సహా ఇతర ఆపిల్ ఉత్పత్తులను కూడా ఈ ఈవెంట్లోనే లాంఛ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కు హాజరుకావాలని ఇప్పటికే చాలా మంది గెస్ట్ లకు ఆపిల్ అహ్వానాలు కూడా పంపిందట. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12న రాత్రి 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

ఎప్పటిలానే ఐఫోన్ సిరీస్ లో నాలుగు మోడల్స్ ను విడుదల చేయనున్నారు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్ ను లాంఛ్ చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫీచర్లు, కలర్ వేరియంట్ల గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఏంటంటే ఐఫోన్ 15 సిరీస్ లో యూఎస్బీ టైప్ -సీ పోర్టును ఉపయోగిస్తారా, లేదా లైట్నింగ్ పోర్టునే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. యూఎస్బీ సీ-టైప్ ఉపయోగిస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియోలో ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 12 న దీనిపై క్లారిటీ రానుంది.

అలాగే ఈ ఈవెంట్ లో రెండు కొత్త స్మార్ట్ వాచ్ లను కూడా ఆపిల్ లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 విడుదల కానున్నాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 8 కు కొనసాగింపుగా ఆపిల్ వాచ్ సిరీస్ 9 వస్తోంది. ఇది అల్యూమినియం బాడీతో ఐదు కలర్ వేరియంట్లలో లభించనున్నట్లు సమాచారం. అలాగే స్టెయిన్ లెస్ స్టీల్ బాడీతో మూడు కలర్ వేరియంట్లలో రానుందట. ఇక ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ను త్రీడి ప్రిటింగ్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందిస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement