Monday, April 29, 2024

‘వెన్నెల సాక్షిగా’ కథల సంపుటి ఆవిష్కరణ.. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్న రచయితలు

సినీ రచయిత దివాకర బాబు రాసిన 24 కథల సంపుటి ” వెన్నెల సాక్షిగా” పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం, 18 అక్టోబర్ 2022న జరిగింది. ప్రతి కథలోనూ జరిగే సంఘటనలకు వెన్నెల సాక్షీభూతమై నిలవడం ఈ కథల ప్రత్యేకత అని పుస్తాకావిష్కకరణకు వచ్చిన వక్తలు అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు, సాహితీవేత్త ఎన్.సిహెచ్ చక్రవర్తి ఈ సభకు అధ్యక్షత వహించారు. నవలా రచయిత చంద్రశేఖర ఆజాద్ ముఖ్య అతిథిగా, శిరీష కార్యక్రమ సమన్వయ కర్తగా వ్యవహరించారు.

కాగా, రచయిత దివాకర్​ బాబు చెల్లెళ్లు కస్తూరి ఇయ్యూణి, అలివేలు కోకటం సంపుటిని ఆవిష్కరించారు.  దివాకర్​ బాబు నాలుగున్నర దశాబ్దాల సాహితీ, సినీ ప్రస్థానాన్ని, నైతిక విలువలకు, కుటుంబ బంధాలకు, బాధ్యతలకు ప్రాధాన్యతనిచ్చే వ్యకిత్వాన్ని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.  తన సోదరి కందాళ కనకవల్లికి ‘వెన్నెల సాక్షిగా’ కథల సంపుటిని అంకితమిచ్చారు రచయిత దివాకరబాబు.

దృశ్య మాధ్యమానికి అలవాటు పడిన యువతలో గ్రంథ పఠనంపై ఆసక్తి పెంపొందాలని తన ప్రసంగంలో అభిలషించారు రచయిత చంద్రశేఖర ఆజాద్. కథల నేపథ్యాన్ని ప్రతిబింబించేట్లు ముఖ చిత్రాన్ని రూపొందించిన చిత్రకారుడు మాధవ్ ప్రతిభను సభలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఈ పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకులు, దివాకరబాబు తనయులు శ్రీకర బాబు, తనయ డా.సాహిత్య పాల్గొన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement