Monday, April 29, 2024

International – డ‌ల్లాస్ లోని గ్రేటర్ రాయలసీమ వాసులకు ‘గ్రాడా’ సేవలు

ఉద్యోగ మేళాలు, మాట్రిమోనీ సదుపాయాలు
స్పోర్ట్స్ యాక్టివిటీస్.. అవగాహన కార్యక్రమాలు
150 మందితో ప్రారంభమై.. దినదినాభివృద్ధి
ఎవరైనా సరే.. సాయం పొందొచ్చన్న సంస్థ ప్రతినిధులు

అమెరికాలోని డల్లాస్ నగరంలో గ్రేటర్ రాయలసీమ ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నామని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ ప్రతినిధులు డాక్టర్ దర్గా నాగిరెడ్డి, చెన్నా కొర్వి, డాక్టర్ రాజేంద్ర ప్రోలు, డాక్టర్ శ్రీనాథ్ పలవల తెలిపారు. ఈ సందర్భంగా గ్రాడా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వివిధ కారణాల రీత్యా అమెరికాలోని డల్లాస్ నగరానికి వచ్చిన విద్యార్థులు,ఉద్యోగులు, దంపతులు, పిల్లలకు తమ సంస్థ (గ్రాడా) సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.

ఉద్యోగ మేళాలు.. మాట్రిమోనీ సదుపాయాలు

గ్రేటర్ రాయలసీమ విద్యార్థుల కోసం ఉద్యోగమేళాలు, మహిళా సాధికారత కోసం ఉమెన్ ఫోరం, వివాహం కోరుకునే యువతి యువకుల కోసం మాట్రిమోనీ, సదుపాయాలను గ్రాడా కల్పిస్తున్నదని తెలిపారు. గ్రేటర్ రాయలసీమ సంస్కృతిని కాపాడడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు డల్లాస్ నగరంలో నిర్వహిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్టు వివరించారు.

స్పోర్ట్ యాక్టివిటీస్.. అవగాహన కార్యక్రమాలు..

ఇవే కాకుండా.. క్రీడలు, పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి కావలసిన అవగాహన కార్యక్రమాలు, వైద్య, నేత్ర శిబిరాలు, ఆధ్యాత్మిక, రియల్ ఎస్టేట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

- Advertisement -

అనేక కార్యక్రమాలు..

డల్లాస్ నగరంలో రాయలసీమ ప్రజల కోసం 150 మంది విరాళాలతో ప్రారంభమైన గ్రాడా సంస్థ రోజుకి రోజుకి తన సభ్యుల సంఖ్యను పెంచుతూ గ్రేటర్ రాయలసీమ తెలుగు ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. డల్లాస్ వాసులు, డల్లాస్ కి వచ్చే రాయలసీమ వాసులు గ్రాడా సంస్థ సేవలను వినియోగించుకోవడానికి www.gradaus.org వెబ్ సైట్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement