Sunday, April 28, 2024

International – మిస్‌ వరల్డ్‌-2024 గా చెక్‌ రిపబ్లిక్‌ సుందరి క్రిస్టినా పిస్కోవా

మిస్‌ వరల్డ్‌-2024 కిరీటం చెక్‌ రిపబ్లిక్‌కు దక్కింది. ఆ దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అందుకున్నారు.

ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్‌-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), యాస్మిన్‌ అజైటౌన్‌ (లెబనాన్‌), అచే అబ్రహాంస్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో మిస్‌ వరల్డ్‌ కిరీటం క్రిస్టినాకు దక్కింది. రన్నరప్‌గా లెబనాన్‌కు చెందిన అజైటౌన్‌ నిలిచారు.

ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన కన్నడ భామ సినీశెట్టి టాప్‌-8కు పరిమితమయ్యారు. ఇతర దేశాల అందాల భామలకు గట్టి పోటీ ఇచ్చినా, అజైటౌన్‌ (లెబనాన్‌) టాప్‌-4కు ఎంపిక కావడంతో సినీ శెట్టి అక్కడి నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది.

ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నీతా అంబానీ.. మిస్‌ వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డును అందుకున్నారు. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌ ఉమెన్‌ జూలియా మోర్లీ ఈ అవార్డును ప్రదానం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement