Sunday, April 28, 2024

రష్యాలో ఇన్ఫీ మూసివేత, ప్రపంచ దేశాల ఒత్తిడి.. ఉక్రెయిన్‌పై యుద్ధమే కారణం

దేశంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ రష్యాలోని తన కార్యాలయాన్ని మూసివేసేందుకు నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిస్పందనగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాలో కార్యకలాపాలను మూసివేయాలని ఇన్ఫోసిస్‌పై ఒత్తిడి వస్తున్నదని సమాచారం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా చాలా పెద్ద వ్యాపారాలు దేశం విడిచి వెళ్లిపోయాయి. ఇన్ఫోసిస్‌ మాస్కో ఉద్యోగుల కోసం ప్రత్యామ్నాయాలను చూస్తోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి తరువాత రష్యాపై చాలా దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వేలాది మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.

40లక్షల కంటే ఎక్కువ మంది ఉక్రెయిన్‌ విడిచి ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. ఇన్ఫోసిస్‌ పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకోనుందని ఆ కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. 2022-23 సంవత్సరంలో రికవరీ వేగవంతం అవుతుందని, రాబోయే కాలంలో వృద్ధికి ఈ సంవత్సరం చాలా కీలకం అని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 55వేల మందికి పైగా ఫ్రెషర్లకు అవకాశం కల్పించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement