Friday, May 3, 2024

కరోనా నిబంధనలు పాటించకుంటే నో ఫ్లై..

విమానాల్లో ప్రయాణించేటప్పుడు కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులపై కేంద్ర పౌర విమానయాన శాఖ కఠిన నిబంధనలు చేపట్టనుంది. దీనికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు కేంద్ర విమానయాశాఖ మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు ఇచ్చామని, వాటిని పాటించని  ప్రయాణికులను ‘నో ఫ్లై’ జాబితాలో పెట్టాల్సిందిగా విమానాశ్రయాల ప్రాధికార సంస్థకు ఇప్పటికే ఆదేశాలు పంపించామని ఆయన చెప్పారు. నిబంధనలను పాటిస్తే కరోనాపై విజయం సాధించవచ్చని, కానీ, కొందరి నిర్లక్ష్యం కారణంగానే సమస్యలు వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ని ఆదేశించామన్నారు. నిబంధనలను పాటించని ప్రయాణికులను మళ్లీ విమానం ఎక్కకుండా నిషేధిత ప్రయాణికుల జాబితాలో పెడతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement