Thursday, May 2, 2024

మ‌రి కోద్దిసేప‌ట్లో భార‌త్ -వెస్టిండీస్ తొలి వ‌న్డే.. 1000 అంతర్జాతీయ వన్డే మ్యాచ్, చ‌రిత్ర సృస్టించ‌నున్న భార‌త్..

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య పరిమిత ఓవర్ల సమరం నేటి నుంచి ఆరంభం కానుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. ఇవ్వాల మధ్యాహ్నం 1.30కు తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌పై 3-2తో టీ20సిరీస్‌ను గెలుచుకున్న విండీస్‌ సమరోత్సాహంతో బరిలోకి దిగనుంది. మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురైన భారతజట్టు నేడు 1000వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ ఆడనుంది. 2020 నుంచి 15వన్డేలు ఆడిన టీమిండియా 5మ్యాచ్‌ల్లో గెలిచి 10 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. వైట్‌బాల్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం కానుంది. కేఎల్‌ వ్యక్తిగత కారణంతో దూరమవగా, ధావన్‌, రుతురాజ్‌ కరోనా బారిన పడటంతో రోహిత్‌ యువ ఓపెనర్‌ ఇషాన్‌కిషన్‌తో కలిసి ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగనున్నాడు. మయాంక్‌ అగర్వాల్‌ క్వారంటైన్‌ గడువు పూర్తికాకపోవడంతో ఇషాంత్‌ను ఓపెనర్‌గా తీసుకున్నట్లు తెలిపాడు. విండీస్‌తో సిరీస్‌ తప్ప టెస్టు కెప్టెన్సీ గురించి ఆలోచించడం లేదని రోహిత్‌ తెలిపాడు.

భారత్‌ కు 1000వ మ్యాచ్..

నేడు భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగే వైట్‌బాల్‌ సిరీస్‌లోని తొలివన్డే భారత క్రికెట్‌ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. 2002లో 500వ వన్డే మ్యాచ్‌ ఆడిన టీమిండియా అనంతరం రెండు దశాబ్దాల తర్వాత సహస్ర మ్యాచ్‌ ఆడనుంది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యధికంగా 1000వన్డేలు ఆడిన తొలి జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. విండీస్‌తో జరిగే వన్డేసిరీస్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుండగా టీ20సిరీస్‌ కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా భారతజట్టు తొలివన్డే మ్యాచ్‌ 1974లో లీడ్స్‌ వేది కగా ఇంగ్లండ్‌తో ఆడి 4వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు 999 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 518మ్యాచ్‌ల్లో విజయం సాధించి 431మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. 958మ్యాచ్‌ల్లో 581మ్యాచ్‌ల్లో విజయంసాధించిన ఆసీస్‌ తొలిస్థానంలో కొనసాగుతుంది. 900పైగా వన్డేమ్యాచ్‌లు ఆడిన దేశాల్లో భారత్‌ తరువాత ఆస్ట్రేలియా 958, పాకిస్థాన్‌ 936 మ్యాచ్‌లతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.

సచిన్‌కు చేరువలో కోహ్లీ.. ఆరు పరుగుల దూరంలోనే..

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ జట్టు సారథిగా తప్పుకున్నా రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు. విండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో సెంచరీ కరవుకు చెక్‌ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత రెండేళ్లలో ఏ ఫార్మాట్‌లోనూ కోహ్లీ మూడంకెల స్కోరును సాధించడంలో విఫలమయ్యాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో 33ఏళ్ల కోహ్లీ మరో వ్యక్తిగత మైలురాయికి చేరుకోనున్నాడు. సొం తగడ్డపై వన్డేల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో భారత బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీ కేవలం 6పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా భారత్‌లో 5వేలకు పైగా వన్డే పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఏకైక బ్యాటర్‌గా సచిన్‌ కొనసాగుతు న్నాడు. సచిన్‌ తన 121వ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌పైనే భారత్‌ 5వేల వన్డే పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. మరోవైపు ఆదివారం జరిగే తొలివన్డేలో కోహ్లీ 6పరు గులు చేయగలిగితే 96వ వన్డే ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను సాధించిన బ్యాటర్‌గా నిలుస్తాడు.

- Advertisement -

భారత్‌ అంచనా జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌కోహ్లీ, పంత్‌ (వికెట్‌కీపర్‌), సూర్య, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, సిరాజ్‌, చాహ ల్‌, ప్రసిధ్‌కృష్ణ. వెస్టిండీస్‌ అంచనా జట్టు: బ్రాండన్‌కింగ్‌, షాయ్‌హోప్‌ (వికెట్‌కీపర్‌), బ్రావో, బ్రూక్స్‌, పూరన్‌, పొలార్డ్‌ (కెప్టెన్‌), జాసన్‌ హోల్డర్‌, ఓడియన్‌స్మిత్‌/అల్జారీ జోసెఫ్‌, వాల్ష్‌, హోసెయిన్‌, కీమర్‌రోచ్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement