Monday, May 6, 2024

IND vs AUS | భారత్‌, ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌.. 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు

భారత్‌, ఆస్ట్రేలియా టీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌ ఈనెల 23 నిర్వహించ నున్నట్లు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నం డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. ఏసీఏ, విడిసిఎ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతుందని, ఈ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఈనెల 15,16 తేదీల్లో ఉదయం 11గంటలకు నుంచి పేటీఎం ఐఎన్‌ఎస్‌ఐడిఇఆర్‌ డాట్‌ ఇన్‌ లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించనున్నట్లు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఎసి ఎ కార్యదర్సి ఎస్‌.ఆర్‌. గోపినాధ్‌రెడ్డి వెల్లడించారు.

అదే విధంగా ఈనెల 17,18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి విశాఖపట్నం పీఎంపాలెంలో ఉన్న డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. ఏసీఏ, వీడీసీఎ క్రికెట్‌ స్టేడియంలో బి. గ్రౌండ్‌, వన్‌ ట్‌ౌలో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన కౌంటర్లు ద్వారా ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు ఆయా కౌంటర్లులో 19వ తేదీ నుంచి 23వ తేదీవరకు రెడీమ్‌ చేసుకోవచ్చన్నారు. టిక్కెట్లు ధరలు రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500, రూ.600 విలువగల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు పెద్ద స్క్రీన్లు

ఏసీఎ ఆధ్వర్యంలో ఈ నెల 15న మూడు నగరాల్లో ఏర్పాటు చేస్తున్న ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపీనాథ్‌ రెడ్డి తెలిపారు. భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య జరిగే ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ను తిలకించేందుకు ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ ఏసీఏ ఆధ్వర్యంలో ఈనెల 15న తేదీ మద్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్రంలోని మూడు నగరాల్లో పెద్ద స్క్రీన్లు ను ఫెన్‌పార్క్‌ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

ఇందులో భాగంగా వైజాగ్‌ ఆర్కేబీచ్‌ వద్ద కాళీ మాత టెంపుల్‌ ఎదురుగా, విజయవాడ ఎంజీరోడ్డులో ఉనన ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, వైఎస్‌ ఆర్‌ కడప లోని ఆర్ట్స్‌ కాలేజీ గౌండ్‌లలో ఒక్కో చోట దాదాపు పది వేల మంది వీక్షించేలా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రవేశం ఉచితంని క్రికెట్‌ అభిమానులు వినియోగించుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement