Friday, May 17, 2024

కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన‌నున్న‌ భారత్‌.. టీమ్‌లో డోపింగ్‌ కలకలం

మరో మూడ్రోజుల్లో కామన్వెల్త్‌ క్రీడలు ప్రారంభం కానుండగా, భారత అథ్లెటిక్స్‌ బందంలో డోపింగ్‌ కలకలం రేగింది. మహిళల 4ఐ100 రిలే బందంలో ఓ అథ్లెట్‌ నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్టు తెలుస్తోంది. డోప్‌ టెస్టులో పాజిటివ్‌ రావడంతో కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే భారత జట్టు నుంచి ఆ మహిళా అథ్లెట్‌ ను తొలగించినట్టు వెల్లడైంది.

ఆ అథ్లెట్‌ పేరును భారత అథ్లెటిక్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) బయటపెట్టలేదు. ఈ పరిణామం అనంతరం, మహిళల రిలే టీమ్‌ లో ప్రస్తుతం నలుగురు సభ్యులే ఉన్నారు. తొలగించిన అథ్లెట్‌ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలియరాలేదు. కామన్వెల్త్‌ క్రీడలు ఈసారి ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌ హామ్‌ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement