Friday, May 17, 2024

Surgical strike – పాకిస్తాన్‌పై భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్ – ఎనిమిది మంది ఉగ్రవాదులు హతం

భారత్ మళ్లీ పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. 12 నుండి 15 మంది కమాండోలు చేపట్టిన ఈ మిషన్ లో ఏడు నుంచి ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ లోకి చొరబడి శత్రువులను హతమార్చింది. రాజౌరీ, పూంచ్ జిల్లాల మధ్య నుండి నియంత్రణ రేఖను దాటి, జమ్మూ కాశ్మీర్‌లోని కోట్లిలోని నక్యాల్‌లో పనిచేస్తున్న ఉగ్రవాదుల నాలుగు లాంచింగ్ ప్యాడ్‌లను పూర్తిగా ధ్వంసం చేశారు.

ఈ సర్జికల్ స్ట్రైక్‌లో భాగంగా మన సైనికులు దాదాపు రెండున్నర కిలోమీటర్లు లోపలికి వెళ్లి.. మిషన్ పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇందులో ఏడెనిమిది మంది ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టినట్టు సమాచారం. భారత భూభాగంపై (పూంచ్, రాజౌరీ జిల్లాలు) భారీ దాడికి చేయడానికి గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఈ లాంచింగ్ ప్యాడ్‌లలో ఉగ్రవాదులు ప్రణాళికలు చేస్తున్నారని భారత భద్రతా ఏజెన్సీలకు నిర్దిష్ట సమాచారం అందింది. ఈ లాంచింగ్ ప్యాడ్‌లపై పాకిస్థాన్ సైన్యం, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ, బ్యాట్ (బీఏటీ) బృందం కదలికలు కూడా పెరిగాయి..

శత్రువులు ఈ విధ్వంసపూరిత ప్రణాళికను అమలు చేయకముందే భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి మొత్తం కుట్రను విఫలం చేసింది. ఇండియన్ ఆర్మీలోని స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన 12-15 మంది కమాండోలు రాజౌరీలోని తార్కుండి సెక్టార్, పూంచ్‌లోని భీంభర్ గలి మధ్య నుండి కాలినడకన నియంత్రణ రేఖను దాటారు. రాత్రి సమయంలో పూర్తి అప్రమత్తతతో ముందుకు సాగారు. గులామ్ జమ్మూ, కాశ్మీర్‌లోని కోట్లి జిల్లాలోని నకాయల్‌లో ఉగ్రవాదులకు చెందిన నాలుగు లాంచింగ్ ప్యాడ్‌లపై రెండున్నర కిలోమీటర్ల లోపలికి వెళ్లి దాడి చేశారు. ఉగ్రవాదులకు, బ్యాట్ సభ్యులకు తిరిగి దాడి చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. రెప్పపాటు క్షణంలో ఇదంతా జరిగిపోయింది. ఈ సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతంగా ముగించుకొని భారత సైనికులు తిరిగి వచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement