Thursday, May 9, 2024

ODI World Cup | సమరోత్సాహంతో భారత్‌.. 11న‌ అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేసు (బుధవారం) న్యూఢిల్లిలోని అరుణ్‌జేట్లీ క్రికెట్‌ స్టేడియం వేదికగా భారత్‌-అఫ్గానిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా నేటి మ్యాచ్‌లో సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొన్న అఫ్గాన్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గి మెగా టోర్నీలో బోణి కొట్టాలని చూస్తోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్త స్థానంలో కొనసాగుతున్న రోహిత్‌సేన బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభగాల్లో సూపర్‌ ఫామ్‌లో ఉంది.

చెపాక్‌ వేదికగ జరిగిన తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ చిరస్మరణీయ ప్రదర్శనతో టీమిండియాను ఆదుకోని గొప్ప విజయాన్ని అందించారు. కేవలం రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను వీరు తమ అపారమైన అనుభవంతో గట్టెక్కించారు. ఇక గత మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి విజృంభించేందుకు సిద్ధమయ్యారు.

ఆసీస్‌ మ్యాచ్‌లో జరిగిన తప్పులు పునరావుతం కాకుండా మంచి హోమ్‌ చేసుకున్నారు. ఇక బ్యాటింగ్‌కు అనుకూలించే ఢిల్లి పిచ్‌పై పరుగుల వరద పారించేందుకు టీమిండియా అన్ని విధాలుగా రెడీ అయింది. ఈసారి భారత్‌ ముగ్గురు స్పిన్నర్లకు బదులు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుందని సమాచారం. ఫ్లాట్‌ పిచ్‌పై బంతి తిరగడం కష్టం. పేసర్లు అయితే పదునైన బంతులు వేయగలరు. ఇదే మైదానంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ పరుగులు నమోదయ్యాయి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు వన్డే ప్రపంచకప్‌ రికార్డును బద్దలుకొట్టి 428 అత్యధిక పరుగులు నమోదు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక కూడా 300 పైనే పరుగులు చేసింది. మొత్తంగా ఆ మ్యాచ్‌లో ఇరుజట్లు 700పైగా పరుగులు చేశారు. అందులో ఏకంగా 31 సిక్స్‌లు ఉండటం విశేషం. సఫారీ జట్టులో ముగ్గురు శతకాలు బాదారు. ఇక పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన టీమిండియా కూడా పసికూన అఫ్గాన్‌పై భారీ పరుగులు చేయడం ఖాయమనిపిస్తోంది.

- Advertisement -

ఓపెనర్లు పుంజుకోవాలి..

ఆసీస్‌ మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ అఎn్గాన్‌ మ్యాచ్‌లో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఇక్కడి పిచ్‌పై వీరిద్దరూ మంచి ఆరంభాన్ని అందిస్తారని టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. అలాగే ఫస్ట్‌ డౌన్‌లో విఫలమైన శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఈసారి బ్యాట్‌ను ఝూళిపించేందుకు రెడీ అయ్యాడు. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా సిరీస్‌లో అయ్యర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. పునరాగమనంలో దూకుడైన బ్యాటింగ్‌తో సత్తా చాటుకున్నాడు. అఎn్గాన్‌పై కూడా భారీ పరుగులు చేస్తాడేమో చూడాలి. తర్వాత దిగే విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గత మ్యాచ్‌లో వీరిద్దరూ తమ బ్యాట్‌తో జవాబు ఇచ్చేశారు. కోహ్లీ ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించగా.. మరోవైపు గాయం నుంచి ఇటీవల కోలుకున్న రాహుల్‌ తన చివరి 8 వన్డేల ఏడు ఇన్నింగ్స్‌లలో 100.50 సగటుతో 402 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 3 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. గత మ్యాచ్‌లోనైతే కేవలం 3 పరుగులతో శతకం మిచ్‌ చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లోనూ ఈ జోడీ టీమిండియాకు అండగా నిలవనుంది. తర్వాత ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజాలు కూడా మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసోచ్చే అంశం. ఆ తర్వాత వచ్చే లోయర్‌ ఆర్డర్‌, తోక బ్యాటర్లు కూడా రాణిస్తే మనం అనుకున్నట్లే టీమిండియా పరుగుల వరద పారించడం ఖాయం.
ఈసారి పేసర్లతో..
న్యూఢిల్లిdలోని ఫ్లాట్‌ పిచ్‌పై టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. దాంతో ఈసారి స్పిన్‌ దళంలో ఇద్దరికే అవకాశం ఉండనుంది. రవీంద్ర జడేజాతోపాటు కుల్దిdప్‌యాదవ్‌ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవీచంద్రన్‌ అశ్విన్‌కు ఈసారి విశ్రాంతి తప్పదనిపిస్తోంది. ఆసీస్‌ మ్యాచ్‌లో జడేజా, కుల్దిdప్‌లు తమ స్పిన్‌ మాయాజాలంతో కంగారులను తెగ కంగారుపెట్టేశారు. ఈసారి పసికూన అఎn్గాన్‌ బ్యాటర్లను కూడా తిప్పేసేందుకు వీరిద్దరూ సిద్ధమయ్యారు. ఇక పేస్‌ విషయానికి వస్తే బుమ్రా, సిరాజ్‌, షమీలతో కూడిన పేస్‌ విభాగం పటిష్టంగా ఉంది. అఎn్గాన్‌ బ్యాటర్లను హడలెత్తించేందుకు భారత పేస్‌ త్రయం ఆతృతగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ డెప్త్‌ కావాలనుకుంటే మాత్రం అప్పుడు షమీకి బదులుగా శార్దుల్‌ ఠాకుర్‌ జట్టులోకి వస్తాడు.

అఎn్గాన్‌ను తక్కువ అంచనా వెయలేం..
సంచలనాలకు మరోపేరు అయిన అఎn్గానిస్తాన్‌ను తక్కువ అంచనా వేయడం కష్టమే. ప్రపంచకప్‌లో చాలా సార్లు ఈ పసికూన పెద్ద పెద్ద జట్లకు షాకిలిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది కాలంగా బ్యాటింగ్‌లో అఎn్గాన్‌ మంచి ప్రదర్శనలు చేస్తోంది. కానీ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో మాత్రం బంగ్లాదేశ్‌పై తేలిపోయింది. కానీ భారత్‌తో జరిగే రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. టాప్‌ క్లాస్‌ బౌలర్లు రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌ అఎn్గాన్‌కు సొంతం. బ్యాటింగ్‌లోనూ గుర్బాజ్‌, ఇబ్రాహీం, హశ్మతుల్లా, నజీబుల్లా, రియాజ్‌ హస్సన్‌లతో అఎn్గాన్‌ పటిష్టంగా ఉంది. నబీ, రషీద్‌ ఖాన్‌లు ఆల్‌రౌండర్ల భూమికా నిర్వహిస్తున్నారు. మొత్తంగా అఎn్గాన్‌ జట్టు టీమిండియాను గట్టి పోటీ ఇచ్చేందుకు పూర్తిగా సిద్ధమైంది.

జట్ల వివరాలు..
భారత్‌ (అంచనా): రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, కుల్దిdప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ/శార్దుల్‌ ఠాకుర్‌.
అఎn్గానిస్తాన్‌ (అంచనా): హశ్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), ఇబ్రాహీం జర్దాన్‌, అబ్దుల్‌ రహ్మాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జయ్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, ఇక్రం అలిఖిల్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, నజీబుల్లా జర్దాన్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, రహ్మతుల్లా గుర్బాజ్‌, రహ్మాత్‌ షా, రియాజ్‌ హస్సన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement