Tuesday, April 30, 2024

దేశవ్యాప్తంగా 19.18 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ

కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో భారత్ మరో మైలురాయి చేరింది. ఈనెల 20 వరకు 19.18 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌ గురువారం 125వ రోజు చేరగా.. రాత్రి 8 గంటల వరకు 19,18,10,604 డోసులు అందజేసినట్లు పేర్కొంది. గురువారం ఒకే రోజు 14.56 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. 12,73,785 తొలి డోసులు కాగా.. 1,82,303 రెండో డోసులని తెలిపింది. 18- 44 మధ్య వయసుగల వారిలో.. గురువారం 7,36,514 మంది తొలి డోసు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది.

ఇప్పటి వరకు వేసిన 19.18 కోట్ల డోసుల్లో హెల్త్‌ కేర్‌ వర్కర్లకు 97,23,296 మొదటి డోసు, 66,80,206 మందికి రెండో డోసు వేయగా.. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో 1,47,84,918 ఫస్ట్‌ డోస్‌, 82,84,445 మందికి రెండో మోతాదు అందజేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 18-44 సంవత్సరాల మధ్య వారికి 85,84,054 ఫస్ట్‌ డోసు వేసినట్లు చెప్పింది. 45-60 మధ్య లబ్ధిదారులకు 5,98,12,707 ఫస్ట్‌ డోస్‌, 95,75,946 సెకండ్‌ డోస్‌ పంపిణీ చేసినట్లు వివరించింది. 60ఏళ్లు దాటిన 5,62,36,899 మంది లబ్ధిదారులకు మొదటి, 1,81,28,133 మందికి రెండో డోసులు అందజేసినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement