Friday, April 26, 2024

Big story | మనమూ కొందాం ఎలక్ట్రిక్‌ బండి.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెరుగుతున్న ఆసక్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మార్కెట్లోకి వస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రజల్లో ఆసక్తి నానాటికీ పెరుగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్న వేళ పేద, మధ్యతరగతి వర్గాలు దీన్ని ఉపశమనంగా భావిస్తున్నారు. మనమూ కొందాం.. ఎలక్ట్రిక్‌ బండి అంటూ చిరు వ్యాపారులు, చిరుద్యోగుల కదంతొక్కి ముందుకు సాగుతున్నారు. రాజధాని నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ ఆటోలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బాస్కెట్‌, మింత్రా తదితర నిత్యం సరుకులు సరఫరా చేసే ఈ-కామర్స్‌ సంస్థలన్నీ దాదాపుగా ఈ వాహనాలనే వినియోగిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలు పేద, మధ్యతరగతి వర్గాలకు, చిరు వ్యాపారులు, చిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి.

20 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో తిరుగుతూత నిత్యం కూరగాయలు, తినుబండారాలు విక్రయించే వారంతా ఈవీలపైనే మోజుపడుతున్నారు. ఆ దిశగానే ప్రభుత్వ పాలసీలు రూపుదిద్దుకుంటున్నాయి. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు ప్రత్యేక రాయతీలతో ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో పభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. దేశం దృష్టిని మరల్చిన సరికొత్త కార్లు, బైక్‌లు నగరాల్లో నిత్యం నమకు కనిపిస్తూ ఆకర్షిస్తున్నాయి. మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య గరిష్టంగా 10శాతానికి చేరుకుంటోంది. మితిమీరుతున్న కాలుష్యానికి ‘ఈవీ’ ఒక మందు లాంటిదని పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -

ప్రభుత్వ రంగంలో ప్రాధాన్యత పెంచే ప్రయత్నం

సాధ్యమైనంత త్వరలోనే ప్రభుత్వ రంగంలో కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రాధాన్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2030 నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అధికార యంత్రాంగం వినియోగించే వాహనాల్లో 100శాతం ఎలక్ట్రిక్‌ కార్లు ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దేశంలో విద్యుత్‌ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఏటేటా ఈ వాహణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోనూ నాలుగేళ్లుగా వీటి సంఖ్య పెరుగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతో పోల్చితే విద్యుత్‌ వాహనాల ధరలు, ఇంధన వ్యయం తక్కువగా ఉండటంతో పాటు- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా 16.85 లక్షలకు ఎలక్ట్రిక్ర్‌ వాహనాల సంఖ్య పెరిగింది. గత ఏడాది దేశశ్యాప్తంగా 10 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడుపోయాయి.

2024 వరకు ఫేమ్‌ ఇండియా పాలసీ

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్రల్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌ ఇండియా-1, ఫేమ్‌ ఇండియా-2 అమలు చేస్తోంది. ఫేమ్‌-ఇండియా-2 కింద ఎలక్ట్రిక్ర్‌ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇటీ-వల పార్లమెంట్‌లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎలక్ట్రిక్ర్‌ ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ ప్రోత్సాహక రాయితీని రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచినట్లు- కేంద్రం తెలిపింది. ఫేమ్‌ తొలి దశ ఏప్రిల్‌ 2015 నుంచి 2019 మార్చి నెలాఖరు కొనసాగింది. ఏప్రిల్‌ 2019 నుంచి ఫేమ్‌-2 ప్రారంభమైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ పాలసీ 2024 మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రిక్ర్‌ వాహనాలకు డిమాండ్‌ను సృష్టించడంతో పాటు- చార్జింగ్‌ సౌకర్యాలు కల్పనకు, అన్ని రకాల వాహనాలను ప్రోత్సహించడానికి రూ.10వేల కోట్లు- కేటాయించినట్లు- కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలక్ట్రిక్ర్‌ వాహనాలపై జీఎస్‌టీ-ని 12 శాతం నుంచి 5 శాతానికి, అలాగే చార్జర్‌లు, చార్జింగ్‌పైన జీఎస్‌టీ-ని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు- తెలిపింది. ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇస్తోంది. ద్విచక్ర వాహనాలకు కిలోవాట్‌కు రూ.15 వేలను, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు రూ.10 వేలను, బస్సులకు రూ.20 వేలను రాయితీగా అందిస్తోంది.

మితిమీరుతున్న కాలుష్యానికి ‘ఈవీ’ మందు

పెరిగిపోతున్న కాలుష్యం బారినుంచి ప్రజలను, పర్యావరణాన్ని కాపాడాలంటే 2040 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ కార్లను నిషేధించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కంపెనీ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమి-టె-డ్‌ (సీఈఎస్‌ఎల్‌) ఏపీ సహా దేశంలోని 18 రాష్ట్రాలకు ఎలక్ట్రిక్‌ వాహనాలను సమకూర్చనుంది. ఇందుకోసం -టె-ండర్లను కూడా ఆహ్వానించింది. 3 నుంచి 5 ఏళ్ల కాలానికి 3,500 ఎలక్ట్రిక్ర్‌ కార్లను కొనుగోలు చేసి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌, హరియాణ, అస్సాం, ఒడిశా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, జమ్మూ-కాశ్మీర్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని ప్రభుత్వ విభాగాలకు అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని భావిస్తోంది. అదేవిధంగా ఏపీ సహా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో విద్యుత్‌ బస్సుల్ని నడిపేందుకు కూడా సీఈఎస్‌ఎల్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం -టెండర్లను కూడా ఆహ్వానించింది. ఆయా రాష్ట్రాలు సొంతంగా చార్జింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు- చేసుకోవడంతోపాటు- అవసరమైన అనుమతులను అందించాల్సి ఉంటు-ంది. సీఈఎస్‌ఎల్‌ ఇప్పటికే దాదాపు 5వేల విద్యుత్‌ కార్లను ఈ విధంగా వివిధ రాష్ట్రాలకు సమకూర్చనుంది.

ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఈవీ స్టేషన్‌

విద్యుత్‌ వాహనాలను వేగంగా అందుబాటు-లోకి తీసుకురావాలంటే రాష్ట్రాలకు వివిధ రాయితీలను అందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం కేంద్రం ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఏఎంఈవీ) పథకాన్ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధివిధానాలను రూపొందించాయి. ప్రభుత్వ రంగంలో విద్యుత్‌ వాహనాలను అందుబాటు-లోకి తీసుకురావడం కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 50వేల ఈ-బస్సులు, 10 లక్షల త్రీ వీలర్లు, 2 లక్షల పాసింజర్‌ కార్లు, 25 లక్షల ద్విచక్ర వాహనాలను సమకూర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టు-కుంది. గత నెలాఖరు నాటికి సరాసరిగా తెలంగాణాలో 55వేలు, ఏపీలో 49వేలకు పైగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ముడుపోయాయి. అటు దేశ వ్యాప్తంగా 14.50 లక్షల విద్యుత్‌ వాహనాల విక్రయం జరిగినట్లు లెక్కలున్నాయి.

ప్రతిరోజూ 50 లక్షల లీటర్ల ఇంధనం ఆదా

ఇప్పటివరకున్న ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం ద్వారా రోజుకి 50 లక్షల లీటర్ల ఇంధనం (పెట్రోల్‌, డీజిల్‌) ఆదా అవుతోంది. 8,57,441 కేజీల కార్బన్‌డైయా-కై-్సడ్‌ తగ్గుతోంది. 2021తో పోలిస్తే విద్యుత్‌ వాహనాల అమ్మకాలు 2022లతో 110 శాతం పెరిగాయి. 2030 నాటికి దేశంలోని మొత్తం వాహనాల్లో దాదాపు 49 శాతం విద్యుత్‌ వాహనాలే ఉంటాయని అంచనా వేస్తున్నారు. వీటికోసం 4మిలియన్ల పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు అవసరమవుతాయి. దేశవ్యాప్తంగా పెరగనున్న విద్యుత్‌ వాహనాల కోసం జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు, నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఈవీ స్టేషన్‌ను ఏర్పాటు- చేసేందుకు 4 వేల ప్రదేశాలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది.

ప్రయాణ ఖర్చు తక్కువ..

కొత్త కొత్త బ్రాండ్ల చేరికతో మోడళ్లను ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లకు అవకాశం ఉంటు-ంది. ఫీచర్లు, రోజువారీ వ్యయం, వాహన ధర ఆధారంగా ఈవీ కొనుగోలు నిర్ణయం తీసుకుంటు-న్నారు. కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ టూ వీలర్లతో పోలిస్తే ప్రయాణానికి అయ్యే ఖర్చు తక్కువ. ఒకసారి చార్జింగ్‌ చేస్తే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్న వినియోగదార్ల ఆందోళన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా ఉంది. ఈవీ అమ్మకాలు పెరిగేకొద్దీ సుదూర ప్రయాణాలకు బలమైన ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు అవసరం అవుతుంది. ప్రధానంగా వేగంగా చార్జింగ్‌ పూర్తి అయ్యేలా ఫాస్ట్‌ చార్జింగ్‌ వసతులు ఉండాలి. ఈవీలు సింహ భాగం చేజిక్కించుకునే వరకు ఫేమ్‌, పీఎల్‌ఐ పథకాలు కొనసాగాలని తాజాగా కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement