Friday, April 26, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 16 గంటలు

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలలో వారాంతపు భ క్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్ని నిండి క్యూ లైన్‌ వెలుపలకు వ్యాపించింది. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా భక్తులు నిండిపోవడంతో ఏటిసి మీదుగా ఎస్‌ఎమ్‌సి లేపాక్షి సర్కిల్‌ మీదుగా పాత అన్నదానంను దాటి రాంభగీచ, ఆస్థాన మండపం వరకు వరకు క్యూ లైన్‌ వ్యాపించింది. స్వామివారి దర్శనం కోసం దాదాపు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్‌లలో వేచివున్నారు. దీంతో శ్రీవారి ఉచిత దర్శనానికి 16 గంటల సమయం పడుతుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో గదులకు తీవ్ర కొరత నెలకొంది. ఈ రద్దీ నేపథ్యంలో గదులు దొరకని భక్తులు టిటిడి ఏర్పాటు చేసిన షెడ్ల కింద, పార్కులలో సేద తీరుతున్నారు. ఈ రద్దీ కారణంగా టిటిడి ఈవో ఏవి.

ధర్మారెడ్డి అధికారులను ఎప్పటికప్పుడు విజిలెన్స్‌, పోలీసు అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు చేసి క్యూ లైన్‌లను పర్యవేక్షిస్తు క్యూలైన్‌ త్వరిత గతిన కదిలేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే క్యూ లైన్‌లో వేచివున్న భక్తులకు అన్నప్రసాదం విభాగం అధికారులు ఎప్పటికప్పుడు శ్రీవారి సేవకుల సహాయంతో అన్నప్రసాదాలు, తాగునీరు, వేడివేడిగా బిస్మిల్లాబాత్‌ వంటివి అల్పాహారాలు అందచేస్తున్నారు. కాగా ఇంటర్‌ పరీక్షా ఫలితాలు వెలువడడంతో తిరుమలేశుడి దర్శనార్ధం భక్తులు రెండు కాలిబాట మార్గాన, రోడ్డు మార్గాలలో వెల్లువలా భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో ఎటుచూసినా భక్తులతో కిటకిటలాడుతోంది. కాగా ఈ రద్దీ మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement