Saturday, May 18, 2024

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మ‌రిన్ని ప్ర‌త్యేక రైల్ల‌ను ప్ర‌క‌టించిన రైల్వే..

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ర‌ద్దీ దృష్యా ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది… అయితే, తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపింది. ఈ మేరకు దీనికి సంబందించి వివరాలను వెల్లడించింది. హైదరాబాద్ – తిరుపతి, తిరుపతి- హైదరాబాద్, హైదరాబాద్ – నాగర్ సోల్, నాగర్ సోల్ – హైదరాబాద్, నర్సాపూర్ – యశ్వంతపూర్, యశ్వంతపూర్- నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ వివరాలను చూస్తే…

hyderabad – tirupati trains: హైదరాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్ నుంచి సాయంత్రం 06.15 నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.45 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక తిరుపతి నుంచి సెప్టెంబర్ 17 నుంచి సాయంత్రం 05.15 నిమిషాలకు బయల్దేరి… మరునాడు ఉదయం 07.40 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, రాయచూర్, మంత్రాలయం, గుంతకల్, ఎర్రగుంట, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

hyderabad – nagarsole trains: హైదరాబాద్ – నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు., సెప్టెంబర్ 14వ తేదీన హైదరాబాద్ నుంచి సాయంత్రం 05.15 నిమిషాలకు ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 09.25 నిమిషాలకు నాగర్ సోల్ కు చేరుకుంది. ఇక సెప్టెంబర్ 15వ తేదీన నాగర్ సోల్ నుంచి స్పెషల్ ట్రైన్ బయల్దేరుతుంది. ఇది మరునాడు మధ్యాహ్నం 01.00 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది. ఈ రైలు లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బల్కీ, ఉద్గిర్, లాథుర్ రోడ్, గంగాఖేర్, సేలూ, పార్థుర్, జల్న, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.

narsapur – yesvantpur special trains: నర్సాపూర్ – యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు నర్సాపూర్ నుంచి సెప్టెంబర్ 14వ తేదీన మధ్యాహ్నం 03.10 నిమిషాలకు బయల్దేరుతుంది. తిరిగి మరునాడు ఉదయం 10.50 నిమిషాలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది. ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 03.50 నిమిషాలకు బయల్దేరి… మరునాడు ఉదయం 08.30 నిమిషాలకు యశ్వంతపూర్ చేరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement