Sunday, April 28, 2024

రాబోయే రెండు నెలల్లో సినీ జాత‌ర‌.. ప్రీ బిజినెస్ లో 500 కోట్ల రాబడి అంచనా!

రెండు నెలల్లో తెలుగు సినిమా ప్రేక్షకులు ఎన్నో సినిమాలను చూడబోతున్నారు. అన్ని సినిమాలకు క‌లిపి ఏకంగా 500 కోట్ల‌కు పైగా బిజినెస్ జరిగే అవ‌కాశం ఉంది. దీంతో రానున్న‌ ఈ రెండు నెలలు తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా కీలకంగా మార‌నుంది. స్ట్రెయిట్, డబ్బింగ్, పెద్ద, చిన్న సినిమాల కేటగిరీలో ఎన్నో మూవీస్​ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. సెప్టెంబర్-అక్టోబర్ నెలలు సినీ డిస్టూబ్యూట‌ర్ల‌కు చాలా కీలకం, ఎందుకంటే రాబోయే సినిమాలను బాక్సాఫీస్ వ‌ద్ద‌ రికార్డులు క్రియేట్ చేసే అవ‌కాశాల‌నున్నాయి.

ఈ జాబితాలో మొదటి మూవీ విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషీ ఉంది. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది. ఇక‌, సెప్టెంబరు 7న షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ విడుదలవుతుండగా, ఆ సినిమా తెలుగు వెర్షన్‌ హక్కులు 15 కోట్లకు కోట్‌ అవుతున్నట్లు సమాచారం. అలాగే.. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను స్కంద సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుండగా, ఈ సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కోట్ల బిజినెస్ చేసింది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బాగా ప్రచారంలో ఉన్న సీక్వెల్ టిల్లు స్క్వేర్ వ్యాపారం దాదాపు 20 కోట్లకు పైగానే ఉంటుంది. అదే విధంగా రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 కూడా 13 కోట్లకు ప్రీ బిజినెస్ చేసింది. ది మోస్ట్ ఎవైటెడ్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ ల సాలార్ మూవీ మేకర్స్ 200 కోట్ల రేంజ్ లో కోట్ చేశారట.

- Advertisement -

బాలకృష్ణ భగవంత్ కేసరి 65 కోట్లు, దళపతి విజయ్ లియో 23 కోట్లు. దాదాపు 30 కోట్లతో రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు.. కొన్ని చిన్న సినిమాలు కూడా ఈ పెద్ద సినిమాల‌ మధ్య విడుదలవుతున్నాయి. ఓవరాల్‌గా, వచ్చే 2 నెలల్లో విడుదలవుతున్న అన్ని సినిమాల బిజినెస్ మొత్తం కలిపితే, అది కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే దాదాపు 500 కోట్లు దాటుతుందని సినీ విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement