Monday, April 29, 2024

ఎఫ్డీ వడ్డీరేట్లను పెంచిన ఐసీఐసీఐ..

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుపై వడ్డీరేట్లు పెంచింది. రూ.2కోట్ల నుంచి రూ.5కోట్లకుపైన ఎఫ్‌డీలకు వడ్డీరేట్లను 5-10బేసిస్‌ పాయింట్లు పెంచింది. కొత్త వడ్డీరేట్లు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్‌ ప్రతినిధులు తెలిపారు. అయితే ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కాలవ్యవధి ఎఫ్‌డీలపైనే వడ్డీ రేట్లను పెంచారు. మిగిలినవాటిపై ఎటువంటి మార్పు చేయలేదు. సీనియర్‌ సిటిజన్లు 4.15శాతం వడ్డీని అందజేస్తారు. ఇంతకుముందు 4.05శాతంగా ఉండేది. కాగా 15నెలల నుంచి 18నెలలలోపు కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై బ్యాంక్‌ 4.20శాతం వడ్డీని ఇస్తుంది.

ఇంతకుముందు ఈ ఎఫ్‌డీలపై 4.10శాతం వడ్డీని చెల్లించేది. 15నెలల నుంచి 18నెలలలోపు కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై బ్యాక్‌ 4.20శాతం వడ్డీని అందజేయనుండగా ఇంతకుముందు 4.10శాతం ఉండేది. ఈ కాలపరిమితిపై వడ్డీరేటును 10బేసిస్‌ పాయింట్లు పెంచారు. కాగా ఈ సవరించిన వడ్డీరేట్లు తాజా డిపాజిట్లు, ఇప్పటికే ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పునరుద్ధరణకు వర్తిస్తాయి. అదేవిధంగా మరో ప్రైవేట్‌ బ్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా వడ్డీరేట్లను పెంచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement