Saturday, May 4, 2024

ఐఏఎస్​ ఆఫీసర్​ పూజాపై ఈడీ దర్యాప్తు.. మైనింగ్​ అక్రమాల్లో హస్తమున్నట్టు ఆరోపణలు

జార్ఖండ్​ రాష్ట్ర మైనింగ్​ అండ్​ జియాలజీ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్​ ఆఫీసర్​ పూజా సింఘాల్​ ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఇవ్వాల (శనివారం) ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఐఏఎస్ పూజా సింఘాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆమెకు సన్నిహితులైన మరో ఇద్దరి నుండి 19 కోట్ల రూపాయల నగదును ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. తనకు మైనింగ్ లీజు లైసెన్స్ మంజూరు చేసిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో ఆమెకు సంబంధం ఉందని, దీంతో ఆమె సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను కూడా ED పరిశీలిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.

కాగా, మైనింగ్ లైసెన్స్ వివాదంపై తన వైఖరిని స్పష్టం చేయాలని ఎన్నికల సంఘం ఈ మధ్యనే హేమంత్ సోరెన్‌కు నోటీసు కూడా జారీ చేసింది. ఐఏఎస్ పూజా సింఘాల్ ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వంలో మైనింగ్, జియాలజీ కార్యదర్శిగా ఉన్నారు. పూజా సింఘాల్ చార్టర్డ్ అకౌంటెంట్ సుమన్ కుమార్ ఇంట్లో 17 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు మొత్తం 19.31 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. ఈ సోదాల సందర్భంగా ఐఏఎస్ అధికారి నివాసంలో నేరారోపణ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement