Thursday, April 25, 2024

క‌ర్నూలులో నకిలీ సీడ్స్‌ దందా.. రైతుల ఉసురు పోసుకుంటున్న అక్రమార్కులు

కర్నూలు, ప్రభన్యూస్ : ఖరీఫ్‌ ఆరంభం కానుండడంతో జిల్లాలో వ్యవసాయ అధికార యంత్రాంగం, రైతులు విత్తన సేకరణ లో బిజీగా ఉన్నారు.వర్షాలు కురిస్తే మే 15 తర్వాత పశ్చిమ ప్రాంతంలో ముంగారు పత్తి విత్తుకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇదే సమయంలో నకిలీ విత్తన మాఫియా మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. అసలును పోలిన నకిలీలను రైతులకు అంటగట్టడంలో నిమగ్నమవుతున్నారు. ఇందుకు కర్నూలు జిల్లా కేంద్ర బిందువుగా మారగా, గత ఏడాది సీడెడ్‌ కంపెనీ పేరుతో పత్తి నకిలీ వినియోగించి వందల మంది రైతులు నష్ట పోయిన సంగతి విధితమే. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా.. ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. కారణం సంబంధిత విత్తన కంపెనీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడమే. ఏదిఏమైనా ప్రతియేటా నకిలీ విత్తన వినియోగంతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు.

అసలు కంపెనీతో పోలిన నకిలీలు..

జిల్లాలో అసలు కంపెనీలతో పోలిన నకిలీ విత్తన ప్యాకెట్లు సరఫరా అవుతున్నాయి. నకిలీ విత్తనాలు సరఫరా చేసే మాఫియా, ముఠాలో సీడ్‌ ఆర్గనైజర్లు, అసలు కంపెనీ పోలిన అందమైన లేబుళ్లు, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లతో రైతులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఇందుకు కారణం జిల్లాలో 20 నుంచి 40 జిన్నింగ్‌ మిల్లులు ఉండడం, ప్రముఖ వ్యాపారులు సీడ్‌ ఆర్గనైజర్ల పేరిట మాఫియాగా ఏర్పడి నాసిరకం విత్తన సరఫరా చేస్తున్నా రు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్ల్రో దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ జిల్లాలో గత ఏడాది రూ. 20 కోట్లు విలువ చేసే నకిలీ విత్తన ఉత్పత్తులను అక్కడి పోలీస్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగాలు స్వాధీనం చేసుకోగా, అందుకు దీటుగా కర్నూలు జిల్లా పోలీసులు నిఘా విభాగం అధికారులు స్వయంగా రంగంలోకి దిగి నంద్యాల నుంచి వాహనంలో అక్రమంగా తరలి వెళ్తున్న 4 వేల క్వింటాళ్ల నాసి రకం సీడ్‌ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్ల్రో ఖరీఫ్‌ ఆరంభంలోనే జరిగింది. ప్రతియేటా నకిలీల దందా కొనసాగుతు ఇప్పటికీ కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ నిఘా విభాగాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement