Thursday, May 2, 2024

New York: అమెరికాలో భారీ అగ్నిప్ర‌మాదం…పేలిన ఆయిల్ ట్యాంక‌ర్లు

అమెరికాలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ హాంప్‌షైర్‌ నగరంలో మూడు ఆయిల్ ట్యాంకర్‌లు, ఓ ట్రాక్టర్ ఈ ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. నార్త్ అట్లాంటిక్ ఫ్యూయల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఆయిల్ ట్యాంకర్‌లు మంటల్లో చిక్కుకోవడంతో ప్రమాదం మరింత పెరిగింది. భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement