Monday, March 27, 2023

Spl Story | ఇంట్లోనే న్యూ ఇయర్​ వేడుకలు.. చాలామంది ఇట్లనే జరుపుకుంటరట!

చైనాలో కరోనా కొత్త వేరియంట్​ కేసుల విస్పోటనం కనిపిస్తోంది. విపరీతంగా కేసులు పెరగడంతో చైనా ఎట్లా సర్వైవ్​ కావాలో తెలియక పోరాటం చేస్తోంది. ఇక.. ఇండియన్​ ఎయిర్​పోర్టులలో జరిపుతున్న పరీక్షల్లో కేవలం రెండు రోజుల్లోనే 39 మంది ఇంటర్నెషనల్​ ప్యాసెంజర్లకు కొవిడ్​ 19 పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ తరుణంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. లోకల్​ సర్కిల్స్​ అనే సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ కొంతమందిని సర్వే జరిపింది. ఈ సర్వేలో చాలా మంది ఇంట్లోనే ఉండి నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటామని వెల్లడించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

- Advertisement -
   

2022వ సంవత్సరం మరి కొన్ని గంటల్లో ముగియనుంది. 2023కు వెల్​కమ్​ చెప్పేందుకు ప్రజలంతాఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఎట్లాంటి సంబురాలు, వేడుకలు జరుపుకోకుండా ఇండ్లకే పరిమితమైన వారికి ఈ ఏడాది కాస్త ఊరట అనే చెప్పుకోవాలి. 2022 ప్రారంభంలోనే టీకాలు అందుబాటులోకి రావడం, వైరస్​ వ్యాప్తి కూడా నెమ్మదించడంతో మళ్లీ ఓల్డ్​ డేస్​ని చూస్తున్నాం. కాగా, నూతన సంవ్సతర మెగా ఈవెంట్​ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువమంది గుమిగూడడం వల్ల వైరస్​ వ్యాప్తించే ప్రమాదం ఉందని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖలు మార్గదర్శకాలను జారీ చేశాయి.

ప్రజలు చాలా ఉత్సవాలను 2019 చివరి నుండి 2022 ప్రారంభం వరకు ఇంటి లోపల, జాగ్రత్తలతో జరుపుకున్నారు. రెండు సంవత్సరాల తర్వాత ప్రజలు ఇప్పుడు అడ్డంకులు లేకుండా 2023ని స్వాగతించడానికి ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. భారతదేశం ప్రస్తుతం రిస్క్ జోన్‌లో లేనప్పటికీ.. పొరుగు దేశాల వల్ల ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. ఇతర దేశాల్లో కరోనా వైరస్ కేసుల పెరుగుదలను చూస్తుంటే.. మనం అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నూతన సంవత్సర వేడుకలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్, లోకల్ సర్కిల్స్, న్యూ ఇయర్‌లో వేడుకలను ఎట్లా చేయాలనే అంశంపై పౌరుల సర్వే చేసింది. దేశంలోని 312 జిల్లాల నుండి 13,000 మందిని సర్వేలో పలకరించారు. ఈ సర్వేలో 63% మంది పురుషులు, 37% మంది మహిళలు పాల్గొన్నారు. కొత్త సంవత్సరం 2023 కోసం సోషల్​ యాక్టివిటీస్​, వేడుకలు ఎంత విస్తృతంగా ఉండవచ్చనే అంశాలను ఈ సర్వే హైలైట్ చేస్తుంది. అయితే.. చాలా మంది కొత్త సంవత్సరంలో ఇంటి వద్ద వేడుకలు జరుపుకోవడానికి ఇంట్రస్ట్​ చూపుతున్నట్టు తెలిపారు. 

సర్వేలో పాల్గొన్న వారిని “మీరు 2023 నూతన సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు?” అని ప్రశ్నించగా… 55% మంది “ఇంట్లో, కుటుంబంతో ఉండాలని” ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక.. 19% మంది మాత్రం తాము నూతన సంవత్సరాన్ని జరుపుకోబోమని తెలిపారు.  కొవిడ్ ప్రమాదం.. ఇతర కారణాల వల్ల 5% మంది ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి ప్లాన్ చేసుకోలేదని చెప్పారు. అయితే.. తమ ఇంటి వెలుపల వేడుకలకు ప్లాన్ చేస్తున్న వారిలో 2% మంది ” కుటుంబంతో కానీ, కమ్యూనిటీ సమావేశానికి వెళ్లాలని” ప్లాన్ చేస్తున్నారు. అయితే 3% మంది ” కుటుంబంతో రెస్టారెంట్‌కు వెళ్లాలని” ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాలు

అనేక దేశాల్లో కొవిడ్ కేసు సంఖ్య పెరుగుతోందని, ముఖ్యంగా చైనాలో  పరిస్థితిని అంచనా వేసి.. రాబోయే 40 రోజులు భారతదేశానికి కీలకమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్‌లు నిర్వహించడంతోపాటు ఫోర్త్​ వేవ్​ కనుక వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఇప్పటికే మాక్​ డ్రిల్​ నిర్వహించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు జనవరి 1 నుండి ప్రభుత్వం RT-PCR నివేదికలను తప్పనిసరి చేసింది.

గత వారం కేంద్ర ఆరోగ్య మంత్రితో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. రద్దీ ప్రదేశాలలో మాస్క్​ ధరించాలని నీతి ఆయోగ్ సభ్యుడు, -ఆరోగ్య సభ్యుడు డాక్టర్ వి కె పాల్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ విలేకరులతో అన్నారు. కొవిడ్ పరిస్థితులను అంచనా వేసి, తక్షణ చర్యలు తీసుకోవడం భాగంగా.. 20వేల హాస్పిటల్స్ లో మాక్ డ్రిల్స్ చేశారు. కాగా, దేశవ్యాప్తంగా 11,000 ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి.

దాదాపు 2.8 లక్షల ఐసోలేషన్ పడకలు దేశవ్యాప్తంగా 20,000 ఆరోగ్య సదుపాయాలలో అందుబాటులో ఉన్నాయి.  ఇక.. 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 15,424 ప్రభుత్వ సౌకర్యాలతో సహా 20,021 సౌకర్యాలు ఉన్నాయి. ఈ సౌకర్యాలలో మొత్తం 3,37,710 ఐసోలేషన్ పడకలలో 2,79,202 పని చేస్తున్నాయి. మొత్తం 2,82,229 ఆక్సిజన్ -సపోర్ట్-కోవిడ్ పడకలలో 2,45,894 పనిచేస్తున్నాయి. అంతేకాకుండా, 70,073 ICU పడకలు, 57,286 ICU-కమ్-వెంటిలేటర్ పడకలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement