Tuesday, May 7, 2024

హాట్​ లుక్స్​.. స్విమ్ సూట్‌ ఫొటోల‌ను షేర్ చేసిన అనుష్క‌శ‌ర్మ‌

విరాట్‌ కోహ్లీని పెళ్లాడిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన స్వేచ్ఛ విషయంలో మాత్రం అస్స‌లు తగ్గేదే లేదు అంటోంది. స్విమ్ సూట్ తో ఫొటోలు దిగి హల్ చల్ చేస్తోంది ఈ అమ్మ‌డు. నెట్ ఫ్లిక్స్ షో ‘చక్ దా ఎక్స్ ప్రెస్’ నుంచి బ్రేక్ తీసుకున్న అనుష్క భర్త విరాట్ కోహ్లీతో మాల్దీవుల టూర్‌కి వెళ్లింది. అక్కడ స్విమ్ సూట్ తో బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది. ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ పై తనకు తానే ఫొటోలు తీసుకుని వాటిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ‘ఫొటోలను షేరు చేస్తూ.. ‘మీ ఫొటోలను మీరే తీసుకుంటే వచ్చే ఫలితం ఇది’అని ఆమె క్యాప్షన్ పెట్టింది. ఆరెంజ్ స్విమ్ సూట్ ధరించిన ఆమె తలకు టోపీ కూడా పెట్టుకుని కనిపించింది.

బీచ్ ఒడ్డున ఎండ మండిపోతోంది. అందుకే ఆమె టోపీ ధరించింది అని ఒక అభిమాని అంటే.. మ‌రో అభిమాని రెచ్చిపోయి మరీ.. ‘నీవు ఎంతో హాట్. హాట్ నెస్ లో నిన్ను ఎవరూ బీట్ చేయలేరు’అని కామెంట్ చేశారు. చాలా మంది వెరీ హాట్, బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ స్పందన తెలియజేస్తున్నారు. కూతురు వామికతో కలసి కోహ్లీ జంట మాల్దీవుల టూర్‌ని ఎంజాయ్ చేస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement