Friday, May 3, 2024

HIT 2 | వ‌రల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే !

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ అడివి శేష్ మంచి స్టొరీ సెల‌క్ష‌న్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అండుకుంటున్నాడు. ఇండ‌స్ట్రీకి మంచి థ్రిల్లర్ సినిమాలు అందిస్తూ HIT: ది సెకండ్ కేస్‌తో తన ఖాతాలో మరో హిట్‌ని ఆడ్ చేసుకున్నాడు అడివి శేష్. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విపరీతమైన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా న‌టించింది.

కాగా, థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా మంచి వ్యూస్ ని సంపాదించుకుంది ఈ మూవీ. అయితే ఇప్పుడు HIT 2 ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయింది. ఈ మూవీ ఆగస్ట్ 13 సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో చిన్న స్క్రీన్‌లపైకి రావడానికి సిద్ధంగా ఉంది. HIT 2 ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

రావు రమేష్, కోమలి ప్రసాద్, సుహాస్, హర్షవర్ధన్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి ఇతర కీలక పాత్రలు పోషించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి స్మాల్ స్క్రీన్‌పై సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement